📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Iran: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి- ఆసుపత్రి నేలమట్టం

Author Icon By Vanipushpa
Updated: June 19, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్‌- ఇరాన్(Israel-Iran) మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ఉధృతమౌతోంది. వరుసగా ఏడో రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌(Israel, Gaza, Leboan) రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్.. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా ఇరాన్ తన ప్రతి దాడి తీవ్రతను పెంచింది.

Iran: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి- ఆసుపత్రి నేలమట్టం

పలువురు పేషెంట్లు తీవ్రంగా గాయపడ్డారు

బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ ఉదయం ఇజ్రాయెల్‌ పై ఇరాన్ భీకర దాడికి దిగింది. ఈ క్షిపణి దాడిలో బీర్షెవాలోని సోరోకా (Soroka) ఆసుపత్రి ధ్వంసమైంది. ఈ మిస్సైల్ నేరుగా ఆసుపత్రిపై ఢీ కొట్టింది. ఫలితంగా భవనం నేలమట్టమైంది. నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చి బాలిస్టిక్ మిస్సైల్ నేరుగా ఆసుపత్రి భవనాన్ని తాకింది. ఆ వెంటనే పెద్ద శబ్దం చేస్తూ భవనం నేలమట్టమైంది. పలువురు పేషెంట్లు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో పాటు టెల్ అవీవ్, రమత్ గాన్, హ్యాలోన్‌ లల్లో కూడా క్షిపణి దాడులు సంభవించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. టెల్ అవీవ్ దక్షిణాన ఉన్న హ్యాలోన్‌ లోని ఓ నివాస భవనంపై మిస్సైల్ పడటంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని వోల్ఫ్‌ సన్ మెడికల్ సెంటర్ తెలిపింది. రమత్ గాన్‌లో జరిగిన దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని హీబ్రూ మీడియా పేర్కొంది.

ఆసుపత్రిలో ప్రమాదకరమైన కెమికల్స్ లీకేజ్
సొరొకా ఆసుపత్రిపై దాడి చోటు చేసుకోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఐడీఎఫ్ పేర్కొంది. సోరోకా ఆసుపత్రిలో ప్రమాదకరమైన కెమికల్స్ లీకేజ్ ఏర్పడినట్లు ఇజ్రాయెల్ ఛానెల్ 12 తెలిపింది. ఈ అనుమానంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారని వెల్లడించింది. ఆసుపత్రిపై దాడి పట్ల ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి యూరియెల్ బుసో.. ఘాటుగా స్పందించారు. దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.

Read Also: Iran-Israel War : ఇరాన్ యుద్ధం.. స్వదేశానికి భారత విద్యార్థులు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu hospital leveled Iran attack Latest News in Telugu on Israel Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.