📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran: అత్యంత రహస్య ప్రదేశంలో దాక్కున్న ఖమేనీ?

Author Icon By Anusha
Updated: June 22, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అలముకున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు, దాడులు అంతర్జాతీయంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ యుద్ధ దృశ్యం మధ్యలోకి అమెరికా ప్రవేశించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఇటీవల అమెరికా, ఇరాన్ అణుస్థావరాలపై విజయవంతమైన దాడులు జరిపినట్లు ప్రకటించడం, పరిస్థితిని ఓ కొత్త మలుపుకు తీసుకెళ్లింది.దీంతో యుద్ధం తీవ్రత మరింత పెరిగింది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో బంకర్లలో ఆశ్రయం పొందుతున్న కమాండర్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Khameni) ని అత్యంత రహస్యమైన ప్రదేశానికి తరలించినట్లు సమాచారం.ఖమేనీ ఉన్న ప్రదేశంలో ఎటువంటి సిగ్నల్స్ రాకుండా అన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను నిలిపివేశారు. అయితే ఖమేనీకి ఏదైనా జరిగితే ఆయన వారసులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. ఆయనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుత పరిస్థితులు, టెహ్రాన్ ప్రతిదాడుల గురించి ఆయనతో చర్చిస్తున్నారు.

సూచించిన వారిలో

ఇరాన్ సుప్రీం లీడర్ తన వారసులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ఓ ప్రచురించింది. అయితే సుప్రీం లీడర్ (Supreme Leader) సూచించిన పేర్లను ఇరాన్‌లోని మతాధికారులు పరిశీలిస్తారు. ఆ తరువాత కొన్ని పేర్లను ఎంపిక చేస్తారు. యుద్ధంలో ఖమేనీకి ఏదైనా ప్రమాదం జరిగితే, ఆయన సూచించిన వారిలో ఒకరిని ఎన్నుకోవడానికి చర్యలు తీసుకుంటారు. అయితే తాను సూచించిన పేర్ల నుంచి ఒకరిని త్వరగా ఎంపిక చేయాలని ఖమేనీ ఈ ప్రక్రియ నిర్వహించే నిపుణుల బృందాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.ఇరాన్ సుప్రీం లీడర్‌కు చాలా అధికారాలు ఉంటాయి. ఆయన ఇరాన్ సాయుధ దళాలకు కమాండర్ (Commander of the Iranian Armed Forces) ఇన్ చీఫ్‌గా, న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా వ్యవహరిస్తారు. అయితే, ఈ పదవికి ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీని ఎంపికి చేస్తారని ఆప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఖమేనీ ఎంపిక చేసిన పేర్లలో మోజ్తాజా పేరు లేదు. కాగా, ఖమేనీ సుప్రీం లీడర్‌తో పాటు ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన మిలిటరీ కమాండర్లను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Iran

సైనిక కేంద్రాలపై

ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ (Rising Lion) పేరుతో ఇజ్రాయేల్ జూన్ 13న దాడులు ప్రారంభించింది. ఖమేనీ ఇంటితో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే ప్రాంతంలోనూ వైమానికి దాడులు చేసింది. అయితే మొదటి ఖమేనీని అంతమొందించాలనుకున్న ఇజ్రాయెల్ అయితే అణుశుద్ది కార్యక్రమాన్ని పూర్తిగా నిపివేసేందుకు ఇరాన్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలని టెల్ అవీవ్ (Tel Aviv) భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇరాన్ అణు, సైనిక కేంద్రాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ కీలక అణు శాస్త్రవేత్తలు, సైనికాధికారులు, అణు ప్రాజెక్టు నిపుణులు హతమయ్యారు. ఇరాన్‌లోని ఐక్యరాజ్యసమితి రాయబారి ప్రకారం, ఈ దాడుల్లో 78 మంది మరణించారని, 320 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు.

Read Also: Beaches: భారత్‌లో స్పటికంలా తేలికపాటి నీరు కలిగిన బీచ్‌లు ఎక్కడ ఉన్నాయంటే?

#AliKhamenei #IranIsraelConflict #NuclearTensions #USAirStrike Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.