ఆపిల్ ఐఫోన్ లవర్స్’కి ఇంకా ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికీ బిగ్ షాకింగ్ న్యూస్. ఇప్పటికే మన దేశంలో ఐఫోన్ అంటే ఓ క్రేజ్ ఏర్పడింది. పెద్దలు, పిల్లల నుండి ప్రతి ఒక్కరి చేతిలో మనం ఈ ఐఫోన్ చూస్తుంటాం. కానీ ఐఫోన్ ఇక అంత ఈజీ కాకపోవచ్చు. డోనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల విధానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం చాల విషయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు ఈ ప్రభావం ఆపిల్ ఐఫోన్ ధరలపై కూడా కనిపిస్తుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఐఫోన్లు వాటి ప్రస్తుత ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడవుతాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా ఎందుకు చెబుతున్నారో తెలుసా…
స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం
డోనాల్డ్ ట్రంప్ రెసిప్రొకల్ టారిఫ్ పాలసీని అమలు చేసినప్పుడు, కొత్త టారిఫ్ పాలసీ అమెరికాలో ఉద్యోగాలు ఇంకా తయారీ ఫ్యాక్టరీలను తిరిగి తీసుకువస్తుందని పేర్కొన్నారు. కానీ దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. CNNలో ప్రచురించిన ఒక వార్త ప్రకారం, వెడ్‌బుష్ సెక్యూరిటీస్ గ్లోబల్ టెక్నాలజీ రీసెర్చ్ హెడ్ డాన్ ఐవ్స్, అమెరికాలో ఐఫోన్ ఉత్పత్తి ప్రారంభిస్తే దాని ధర దాదాపు $3,500 (సుమారు రూ. 3.5 లక్షలు)కి చేరుకోవచ్చని షాకింగ్ విషయాన్నీ వెల్లడించాడు, అంటే ప్రస్తుతం ఉన్న ఐఫోన్స్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ అన్నమాట.
ఐఫోన్ ధర ఎందుకు కాస్ట్లీ అవుతుంది
ఐఫోన్ కాస్ట్లీ గా మారడానికి ప్రధాన కారణం అమెరికాలో ఉత్పత్తి వ్యయం పెరగడం. ఐవ్స్ ప్రకారం, ఆసియాలో ఉన్న కంపెనీ సప్లయ్ చైన్ అమెరికాలో బిల్డ్ చేయడానికి ఆపిల్‌కు దాదాపు $30 బిలియన్లు ఖర్చవుతుంది అలాగే ఉత్పత్తిలో కేవలం 10 శాతం మాత్రమే షిఫ్ట్ అవడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం, ఐఫోన్ భాగాలు తైవాన్, దక్షిణ కొరియా ఇంకా చైనాలలో తయారు అవుతున్నాయి, అయితే 90 శాతం ఐఫోన్‌లు చైనాలో అసెంబుల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ దేశాలపై అమెరికా విధించిన భారీ సుంకాలు అలాగే వాణిజ్య యుద్ధం కారణంగా ఐఫోన్ ధరలు ప్రభావితమవుతాయి. ట్రంప్ టారిఫ్ విధానం కారణంగా ఆపిల్ షేర్లు ఇప్పటికే 25 శాతం పడిపోయాయని మీకు తెలిసిందే. మరోవైపు భారతదేశంతో పాటు చైనా పై భారీగా సుంకాలు విధించిన సంగతి సంగతి మీకు తెలిసిందే. కానీ తాజాగా చైనా పై ఈ సుంకాల మోత 104%నికి పెంచింది.
READ ALSO: Trump Tariffs: అధిక సుంకాలను నిలిపివేసినా.. చైనాతో కొనసాగుతున్న వార్