📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IMF Loan To Pakistan: పాక్​కు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థిక సాయం

Author Icon By Vanipushpa
Updated: May 10, 2025 • 2:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్​తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్​ (Pakistan) కు ఆర్థిక సాయం చేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆమోదం తెలిపింది. తక్షణమే బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఐఎంఎఫ్ (IMF) ఆమోదించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) కార్యలయం వెల్లడించింది.
పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత్‌ యత్నం
పహల్గాం (Pahalgam) దాడి తర్వాత పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత్‌ అన్ని మార్గాలపై దృష్టిపెట్టింది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అందించే బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీపై (Bailout pakage) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రుణాన్ని పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి నిధులను సమకూర్చేందుకు వినియోగిస్తోందని ఆరోపించింది. పాకిస్థాన్‌కు రుణానికి సంబంధించి శుక్రవారం ఐఎంఎఫ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎంఎఫ్​ సాయం చేసేందుకు పూర్తిగా వ్యతిరేకించింది. ఓటింగ్​కు కూడా​ భారత్ దూరంగా ఉంది. అయినప్పటికీ పాక్‌కు రుణసాయం అందించేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. మరోవైపు పాకిస్థాన్‌కు ప్రపంచబ్యాంకు ఇచ్చే రుణంపై పునఃసమీక్ష చేయాలన్న భారత్‌ విజ్ఞప్తి చేసిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ మేరకు ప్రపంచబ్యాంక్‌ సమీక్ష చేసినట్లు పేర్కొంది.

IMF Loan To Pakistan: పాక్​కు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థిక సాయం

భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. దీంతో భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికే పాక్ సుమారు 8.8 బిలియన్ డాలర్లు బాకీ పడింది. అలాగే ఐఎంఎఫ్​కు పాక్ నాలుగో అతిపెద్ద రుణగ్రహీతగా ఉంది. యుద్ధ వాతావరణం, ప్రతికూల పరిస్థితుల వల్ల పాక్ స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలుతున్నాయి. భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. పాకిస్థాన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ కరాచీ- 100 ఏప్రిల్ 23 నుంచి 7,500 పాయింట్లకు పైగా కోల్పోయింది.
Read Also: Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న తమిళ విద్యార్థులు.. రంగంలోకి స్టాలిన్ ప్రభుత్వం !

#Financial Assistance #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu International Monetary Fund Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.