📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Pahalgam Attack: పహల్గాం దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత

Author Icon By Vanipushpa
Updated: April 25, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్‌తో 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్నితాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం(ఏప్రిల్ 23)జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ”1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేస్తున్నాం. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఈ తాత్కాలిక నిషేధం అమలులో ఉంటుంది” అని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు.
భారత్ సైనిక చర్యకు దిగుతుందా?
పాకిస్తాన్ విషయంలో భారత్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కానీ అవన్నీ అంత తీవ్రమైనవేమీ కాదు. ”పాకిస్తాన్ హైకమిషన్‌ సిబ్బందిని తగ్గించింది కానీ మూసివేయలేదు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది కానీ రద్దు చేయలేదు. పాకిస్తాన్ ప్రజలకు ఉన్న సార్క్ (SAARC ) వీసా సౌకర్యాన్ని ఆపివేసింది కానీ అన్ని రకాల వీసాలు కాదు” అని ది హిందూ దినపత్రిక దౌత్య వ్యవహారాల ఎడిటర్ సుహాసిని హైదర్ రాశారు. ఈ నిర్ణయాల తర్వాత భారత్ సైనిక చర్యకు దిగుతుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
పాకిస్తాన్ నిపుణులు ఏమంటున్నారు?
భారత్ తీసుకున్న నిర్ణయాలన్నింటిలోకి సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్తాన్‌లో ఎక్కువ చర్చ జరుగుతోంది. భారత్ ఇలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇస్‌హాక్ దార్ పాకిస్తాన్ మీడియాతో అన్నారు. ”గతంలోని అనుభవం దృష్ట్యా భారత్ ఇలా చేస్తుందనే ఆలోచన మాకుంది. నేను తుర్కియేలో ఉన్నా. పహల్గాం దాడిని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఖండించింది.

సింధు జలాల ఒప్పందం: సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ ఇప్పటికే మొండిగా ఉంది. నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వారు ఇప్పటికే కొన్ని రిజర్వాయర్లు కట్టారు. ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకుకు భాగస్వామ్యం ఉంది. ఈ విషయంలో భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదు. అలాంటప్పుడు ప్రపంచంలో నిరంకుశత్వం మొదలవుతుంది. ‘బలవంతుడు సరైనవాడు’ అనేది ఉపయోగపడదు. భారత్ దగ్గర న్యాయపరమైన సమాధానం లేదు. పాకిస్తాన్ న్యాయ మంత్రిత్వ శాఖ దీనికి సమాధానమిస్తుంది” అని ఇస్‌హాక్ దార్ చెప్పారు.
‘అఫ్గానిస్తాన్‌‌కు సరుకులు ఆపుతుందా?’
“సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అయితే సింధు, జీలం, చీనాబ్ నీటిని ఆపడానికి భారత్ దగ్గర మౌలిక సదుపాయాలు లేవన్నది నిజం. కానీ మనం వెంటనే కొన్ని నిర్దుష్ట నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. ప్రపంచ బ్యాంకు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ ఒప్పందానికి హామీ ఉన్నవారిలో ప్రపంచబ్యాంకు ఒకటి. దౌత్య సంబంధాలకు సంబంధించిన నిర్ణయంలో ఎత్తుకు పై ఎత్తు తరహాలో ప్రతిస్పందించవచ్చు” అని భారత్‌లో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ డాన్ న్యూస్‌తో అన్నారు.
భారత్ నిర్ణయాన్ని పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుంది
‘పాకిస్తాన్ వ్యవసాయ ఉత్పత్తులలో 90% సింధు ఒప్పందంతో ముడిపడి ఉన్నాయి
. ఈ ఒప్పందంపై ఆధారపడి ఉన్న పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొంటుంది’ అని ప్రఖ్యాత విశ్లేషకులు షాజాద్ చౌధరిని ఇదే టీవీ కార్యక్రమంలో ప్రశ్నించారు. “ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందానికి ఎలాంటి అడ్డంకీ రాలేదు, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఊహించనిది.
Read Also: Pehalgam : పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ భారత్‌పై ఆంక్షలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Indus Waters Treaty suspended Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.