हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Indus Water: పాక్ కు సింధు నీళ్లు అందకుండా భారత్ మరో వ్యూహం

Anusha
Indus Water: పాక్ కు సింధు నీళ్లు అందకుండా భారత్ మరో వ్యూహం

సింధు జలాల వినియోగంలో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది.భారత ప్రభుత్వం సింధు జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా కీలక చర్యలు చేపట్టింది. జమ్మూకశ్మీర్‌లోని అదనపు జలాలను పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాలకు తరలించేందుకు 113 కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మించాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని ప్రారంభించింది. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదుల పూర్తి వినియోగంతో పాటు, సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదుల నుంచి భారత్‌కు కేటాయించిన వాటాను సంపూర్ణంగా వాడుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

నదులతో అనుసంధానించే

ఫలితంగా పాకిస్థాన్‌కు వెళ్లే అదనపు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గనుంది.జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్టును (జలవిద్యుత్, సాగునీరు, తాగునీరు) కూడా పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. చీనాబ్ నదిని రావి-బియాస్-సట్లెజ్ నదులతో అనుసంధానించే ఈ ప్రతిపాదిత కాలువ, ఇప్పటికే ఉన్న కాలువ నిర్మాణాలను జమ్మూ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలోని 13 ప్రాంతాలలో కలుపుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ద్వారా ఇందిరా గాంధీ కాలువ (Indira Gandhi Canal) కు (సట్లెజ్-బియాస్) నీటిని చేరవేయనున్నారు.ఈ పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, “రాబోయే మూడేళ్లలో సింధు జలాలను కాలువల ద్వారా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు తీసుకువెళ్తాం. దీనివల్ల దేశంలోని పెద్ద విస్తీర్ణంలో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయి, అదే సమయంలో పాకిస్థాన్ ప్రతి నీటి బొట్టు కోసం అల్లాడుతుంది” అని అన్నారు.

Indus Water: పాక్ కు సింధు నీళ్లు అందకుండా భారత్ మరో వ్యూహం
Indus Water

జలాశయాల

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో, చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్, సలాల్ జలవిద్యుత్ ప్రాజెక్టు (Salal Hydroelectric Project) ల జలాశయాల పూడికతీత వంటి స్వల్పకాలిక చర్యలతో పాటు ఈ దీర్ఘకాలిక ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పాకల్ దుల్ (1000 మెగావాట్లు), రాట్లే (850 మెగావాట్లు), కిరు (624 మెగావాట్లు), క్వార్ (540 మెగావాట్లు) వంటి జలవిద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా కూడా సింధు జలాలను మరింతగా వినియోగించుకోవాలని భారత్ భావిస్తోంది.

Read Also: Hilang Yagik: బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన హిలాంగ్ యాజిక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870