📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Harpreet Singh: భారత్​ మోస్ట్‌వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ అమెరికాలో అరెస్ట్

Author Icon By Vanipushpa
Updated: April 18, 2025 • 1:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉగ్రవాదులతో సంబంధాలు కలిగిన మోస్ట్‌వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ హ్యాపీ పాసియా అలియాస్ హర్​ప్రీత్ సింగ్​ అమెరికాలో పట్టుబడ్డాడు. ఎన్​ఫోర్స్​మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్, ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం అతడు FBI అదుపులో ఉన్నాడు. ఇతడికి రెండు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు FBI తెలిపింది. అలాగే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు చెప్పింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు బర్నర్​ ఫోన్​లను ఉపయోగించినట్లు వెల్లడించింది. పంజాబ్‌లో 14 గ్రనేడ్‌ దాడులతో అతడికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

గ్రనేడ్ దాడుల్లో పాసియా ప్రమేయం
కాగా, గత ఏడు నెలల్లో పంజాబ్‌లో 16 గ్రనేడ్‌ దాడులు జరగ్గా అందులో 14 ఘటనలతో పాసియా ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ముఖ్యంగా పోలీస్‌ పోస్టులు, ప్రార్థనా మందిరాలపైనే ఎక్కువగా జరిగాయి. ఇటీవల బీజేపీ నేత మనోరంజన్‌ కాలియాసహా ప్రముఖుల ఇళ్లపై దాడులు జరిగాయి. అయితే, ఈ దర్యాప్తులో హ్యాపీ పాసియా పేరు తెరపైకి వచ్చింది. పాసియాపై 5లక్షల రివార్డ్‌ కూడా ఉంది.
పాసియాకు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ
2024లో ఛండీగఢ్‌లో గ్రనేడ్‌ దాడికి సంబంధించి జనవరి 22న యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో మొత్తం 16 చోట్ల NIA తనిఖీలు నిర్వహించింది. అంతకుముందు మాజీ పోలీస్‌ అధికారి జేఎస్‌ చాహల్‌ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పాసియా పేరిట నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ దాడికి పాసియానే పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నిధులను సమకూర్చినట్లు వెల్లడించింది.
నలుగురిపై NIA కేసులు
ఈ ఏడాది ప్రారంభంలో బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ ఉగ్రసంస్థకు చెందిన నలుగురిపై NIA కేసులుపెట్టింది. ఈ జాబితాలో పాసియాతోపాటు పాక్‌కు చెందిన హర్వీందర్‌ సింగ్‌ సంధు పేరు కూడా ఉంది. “ఈ దాడులకు రిండా, హ్యాపీ పాసియా రూపుకల్పన చేసినట్లు మా దర్యాప్తులో బయటపడింది. ఇందు కోసం రోహన్‌ మిషా, విశాల్‌ మిషాలను నియమించుకోగా, వీరే దాడులు నిర్వహించారు” అని NIA నాడు ఓ ప్రకటనలో చెప్పింది.

Read Also: India: మైనారిటీల హక్కులపై బంగ్లాదేశ్​ను హెచ్చరించిన భారత్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in America India's most wanted gangster arrested Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.