పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై బుధవారం ఉదయం భారతదేశం క్షిపణి దాడులు చేసింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ చర్య తీసుకుంది. ఈ ఆపరేషన్‌కు సైన్యం ‘ఆపరేషన్ సింధూర్ ‘ అని పేరు పెట్టింది. అయితే ఈ దాడితో భారత స్టాక్ మార్కెట్ కాస్త హుషారుగా కనిపించింది. నేడు బుధవారం ఉదయం సెన్సెక్స్ నిఫ్టీ క్షీణతతో ప్రారంభమవగా, కానీ తరువాత ఊపందుకున్నాయి.
కోలుకుంటూ ఉపందుకున్న మార్కెట్
బుధవారం ఉదయం సెన్సెక్స్ 692.27 పాయింట్లు తగ్గి 79,948.80 వద్ద ప్రారంభమవగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 146 పాయింట్లు తగ్గి 24,233.30 వద్ద ప్రారంభమైంది. కానీ కొద్దిసేపటికే మార్కెట్ క్షీణతను తగ్గించుకుని కోలుకుంటూ ఊపందుకుంది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 145.32 పాయింట్లు పెరిగి 80,786.39 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 50 కూడా 42.20 పాయింట్లు పెరిగి 24,421.80 పాయింట్ల వద్ద ఉంది.
తొలుత భారత మార్కెట్లు క్షీణత తర్వాత కోలుకుంది
దీనికి ముందు నిన్న మంగళవారం ట్రేడింగ్ సమయంలో భారత స్టాక్ మార్కెట్లు క్షీణతతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 155.77 పాయింట్లు తగ్గి 80,641.07 వద్ద, నిఫ్టీ 81.55 పాయింట్లు తగ్గి 24,379.60 వద్ద ముగిశాయి. బ్యాంకింగ్,పెట్రోలియం స్టాక్‌లలో లాభాల స్వీకరణ, భారతదేశం అండ్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడంతో మంగళవారం స్థానిక స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే ఆటో మినహా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. PSU బ్యాంక్, రియాల్టీ, ఎనర్జీ, కమోడిటీ, PSE, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. భారత మార్కెట్లపై భౌగోళిక రాజకీయ నష్టాలు పొంచి ఉన్నాయని బ్యాంకింగ్ అండ్ మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా అన్నారు. ఈరోజు బుధవారం భారతదేశ పీఓకే – పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది, ఈ కారణంగా ప్రమాదం మరింత పెరిగింది. ఉరి, బాలకోట్ దాడుల వార్తలు వచ్చినప్పుడు కూడా భారత మార్కెట్లు క్షీణతతో ప్రారంభమయ్యాయి.
భారత మార్కెట్లు మరింత క్షీణతను అవకాశం!
రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై మార్కెట్‌పై భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఈ దాడి నేటికే పరిమితం అవుతుందా లేదా పెరుగుతుందా అనే దానిపై మార్కెట్ భవిష్యత్తు ప్రభావం ఆధారపడి ఉంటుందని అన్నారు. భౌగోళిక రాజకీయ ప్రమాదాలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్నాయి అలాగే భారత మార్కెట్లు మరింత క్షీణతను చవిచూడవచ్చు. ప్రస్తుతం 10:30 నిమిషాలకు నిఫ్టీ50 24,340.25 వద్ద 38,85 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్ 80,521 వద్ద 122.27 పాయింట్లు పడిపోయింది. స్టాక్ మార్కెట్ ప్రారంభంలో అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ లాభాలను ఆర్జించగా, ఎల్ అండ్ టి, టెక్ మహీంద్రా, ఆసియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, టిసిఎస్ నష్టాలను చూశాయి.
Read Also: Friedrich Merz : జర్మనీ రాజకీయాల్లో చారిత్రక పరిణామం