📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Pakistan hackers: పాక్ నకిలీ పీడీఎఫ్‌లతో భారతీయులే టార్గెట్!

Author Icon By Vanipushpa
Updated: May 1, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ఇంటర్నెట్ వినియోగదారులే లక్ష్యంగా పాకిస్థాన్ నుంచి సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ఈ దాడుల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. ముఖ్యంగా, అధికారిక పత్రాల రూపంలో నకిలీ పీడీఎఫ్ ఫైళ్లను పంపి, వాటి ద్వారా హానికరమైన మాల్‌వేర్‌ను చొప్పించి భారతీయుల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు.
నకిలీ పీడీఎఫ్‌లను పంపిస్తున్నట్లు నివేదిక
‘పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన నివేదిక మరియు అప్‌డేట్’ వంటి పేర్లతో నకిలీ పీడీఎఫ్‌లను పంపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇవి ప్రభుత్వ పత్రాల్లా కనిపించినా, వినియోగదారుల సమాచారాన్ని తస్కరించే ఫిషింగ్ డొమైన్‌లకు దారితీస్తాయి. వీటిని తెరిస్తే పరికరాలు హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ ఎత్తుగడలు
ఏపీటీ36 (ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్), సైడ్‌కాపీ వంటి పాకిస్థానీ హ్యాకర్ గ్రూపులు క్రిమ్సన్‌రాట్, కర్‌ల్‌బ్యాక్ రాట్ వంటి మాల్‌వేర్‌లను ఉపయోగించి రక్షణ, ప్రభుత్వ, కీలక మౌలిక సదుపాయాల రంగాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని క్విక్ హీల్ టెక్నాలజీస్, పీడబ్ల్యూసీ ఇండియా వంటి సంస్థల నిపుణులు తెలిపారు. ఈ దాడులు కేవలం సాంకేతిక అంతరాయాలే కాదని, వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ ఎత్తుగడలని వారు విశ్లేషిస్తున్నారు. ఇవి భారత హ్యాకింగ్ గ్రూపుల దాడులకు ప్రతీకార చర్యలుగా కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.
లింకుల పట్ల జాగ్రత్త వహించాలి
ఈ నేపథ్యంలో, వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వారి నుంచి వచ్చే ఈమెయిళ్లు, అనుమానాస్పద పీడీఎఫ్ అటాచ్‌మెంట్లు, లింకుల పట్ల జాగ్రత్త వహించాలి… ఫైల్స్ తెరిచే ముందు వాటి ప్రామాణికతను ధృవీకరించుకోవాలి… ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి… అనుమానాస్పద వెబ్‌సైట్లు, ప్రకటనలపై క్లిక్ చేయవద్దు… అని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also: In-Pakistan: భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు .. చైనా దారి ఎటు?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu from Pakistan! Google News in Telugu Indians are being targeted Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today with fake PDFs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.