📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Iran: భారతీయ విద్యార్థుల ఆందోళన – ఇండియన్ ఎంబసీ తక్షణ చర్యలు

Author Icon By Vanipushpa
Updated: June 16, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్​(Iran)లో ఉన్న భారతీయ(Indian) విద్యార్థులు ఆందోళన చెందారు. గత మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బాంబు పేలుళ్ల శబ్దాలకు బేస్ మెంట్​లోకి పరుగెడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులను ఇరాన్​లోని ఇండియన్ ఎంబసీ(Indian Embassy) సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
‘మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు’
టెహ్రాన్​లోని షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయంలో జమ్ముకశ్మీర్​లోని కుప్వారా జిల్లాకు చెందిన ఇంతిసల్ మోహిదిన్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. తమ విశ్వవిద్యాలయంలో 350 మందికి పైగా భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ఇంతిసల్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్​లో చిక్కుకున్న వందలాది మంది భారతీయ వైద్య విద్యార్థులలో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు పెద్ద పేలుళ్ల శబ్దాలకు మేల్కొని బేస్‌ మెంట్‌ లోకి పరుగెత్తామని వెల్లడించారు. అప్పటి నుంచి విద్యార్థులందరూ నిద్రలేని రాత్రులను గడుపుతున్నారని పేర్కొన్నారు.

Iran: భారతీయ విద్యార్థుల ఆందోళన – ఇండియన్ ఎంబసీ తక్షణ చర్యలు


ప్రతి రోజు రాత్రి పేలుళ్ల శబ్దాలు
“విద్యార్థుల హాస్టళ్లు, అపార్ట్​మెంట్ల నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పేలుళ్లు సంభవించాయి. దీంతో స్టూడెంట్స్ లో భయం పెరుగుతోంది. అందుకే భారత ప్రభుత్వం మమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి తరలించాలి. మేము మా అపార్ట్​మెంట్ బేస్​మెంట్‌ లో చిక్కుకున్నాము. ప్రతి రోజు రాత్రి పేలుళ్ల శబ్దాలు వింటున్నాం. పేలుళ్ల జరిగిన ప్రాంతం మాకు కేవలం 5 కి.మీ దూరంలోనే ఉంది. మేము మూడు రోజులుగా నిద్రపోలేదు. బాంబు దాడుల కారణంగా విశ్వవిద్యాలయం తరగతులను నిలిపివేసింది. పరిస్థితి మరింత దిగజారకముందే మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. రాయబార కార్యాలయం హెల్ప్‌ లైన్‌ లను ఏర్పాటు చేసింది. మాతో టచ్‌ లో ఉంది. కానీ మేము భయపడుతున్నాం. ఇంటికి వెళ్లాలని ఉంది” అని మోహదీన్ తెలిపారు.
భయాందోళనలో విద్యార్థులు
అలాగే, కెర్మాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్​లో శ్రీనగర్​కు చెందిన ఫైజాన్ నబీ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆయన ఇరాన్ లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. టెహ్రాన్ కంటే కెర్మాన్ కాస్త సురక్షితమైనది అయినప్పటికీ, తమకు భయం వేస్తోందన్నారు. కెర్మాన్ నగరంలో ఆదివారం తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నామని తెలిపారు. టెహ్రాన్‌ లోని తన స్నేహితులు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

యూనివర్సిటీ మాకు అండగా లేదు’
ఇరాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్​లో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థిని మిథాత్ సైతం భయాందోళనకు గురయ్యారు. “పేలుళ్లు మాకు కిలోమీటర్ల దూరంలోనే జరిగాయి. అందరూ భయాందోళనకు గురయ్యారు. నా కుటుంబంతో టచ్ లో ఉన్నాను. భారత రాయబార కార్యాలయం వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తోంది. మా విశ్వవిద్యాలయం మాకు అండగా లేదు. భయపడి యూనివర్సిటీ లోపలే ఉంటున్నాం. ఇది ఎంతకాలం కొనసాగుతుందో మాకు తెలియదు. ” అని మిథాత్ పేర్కొన్నారు.

సురక్షిత ప్రదేశాలకు భారతీయ విద్యార్థులు
ఇరాన్​లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో టెహ్రాన్ లోని భారతీయ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యార్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అలాగే టెహ్రాన్​లో భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇతర ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఆదివారం నాడు టెహ్రాన్‌ లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులందరూ ఇంటి లోపలే ఉండి అధికారుల ఆదేశాలను పాటించాలని కోరింది. ఇరాన్​లోని ప్రతి ఒక్కరూ ఎంబసీ నుంచి వచ్చే ఆదేశాలను పొందడానికి టెలిగ్రామ్ లింక్​లో చేరాలని అభ్యర్థించింది.

Read Also: Qatar: ఖతర్‌లో తెలుగు పాస్టర్లు అరెస్ట్

#IndianStudentsInIran #IranIsraelConflict #IndianEmbassy #StudentEvacuation #MBBSStudentsIran #TehranBombing #HelpIndianStudents #IndiaInIran #EmergencyResponse #SaveOurStudents #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.