हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

కరేబియన్‌లో భారత విద్యార్ధిని గల్లంతు

Sharanya
కరేబియన్‌లో భారత విద్యార్ధిని గల్లంతు

అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి అనే భారత సంతతికి చెందిన యువ విద్యార్థిని అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సుదీక్ష గత వారం స్నేహితులతో కలిసి విహారయాత్ర నిమిత్తం కరేబియన్ ద్వీపాలకు వెళ్లింది. అయితే, డొమినికన్ రిపబ్లిక్ దేశంలోని వ్యూంటా కానా ప్రాంతంలోని బీచ్ వద్ద నడుచుకుంటూ వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. స్నేహితుల సమాచారం ప్రకారం, ఈ నెల 6న రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్‌లో నడుచుకుంటూ వెళ్లిన సుదీక్ష కోణంకి అనంతరం కనిపించకుండా పోయింది. దీంతో ఆమె స్నేహితులు ఆందోళన చెందారు. చాలా గంటల పాటు వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో, అధికారులను సంప్రదించారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు బృందాలు డ్రోన్లు, హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టినా, ఇప్పటివరకు ఆమె ఆచూకీ కనిపించలేదు. అధికారులు ఆమె సముద్రంలో కొట్టుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు.

sudiksha konanki 20 last seen 978586213

గాలింపు చర్యలు

భారత సంతతికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి, అక్కడ శాశ్వత నివాసం పొందారు. ప్రస్తుతం వర్జీనియాలో నివాసం ఉంటున్న ఈ కుటుంబం తమ కుమార్తె గల్లంతైన వార్త తెలుసుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సుదీక్ష తల్లిదండ్రులు డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును తీవ్రంగా విమర్శిస్తూ, గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును ఖచ్చితంగా విచారణ చేయాలి. ఆమె సముద్రంలో కొట్టుకుపోయిందనే తేల్చేయకూడదు. ఎవరో ఆమెను అపహరించి ఉండొచ్చు అని భావిస్తున్నారు. .

భారతీయుల సహాయం కోరుతున్న కుటుంబం

సుదీక్ష కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా భారతీయులను, ప్రవాస భారతీయులను తమకు సహాయంగా నిలవాలని కోరుతున్నారు. ఆమె కోసం గాలింపు కొనసాగించేందుకు మరిన్ని రిసోర్సులు వినియోగించాలని కోరుతున్నారు. దీనిపై ఇండియన్ ఎంబస్సీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ దీనిపై స్పందించి, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తున్నాం. సంబంధిత దేశ అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి అని తెలిపారు. అమెరికా అధికారులు కూడా డొమినికన్ రిపబ్లిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. కొన్ని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు డొమినికన్ రిపబ్లిక్‌లో కొందరు విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేయడం జరుగుతోంది అని నివేదికలు ప్రచురించాయి. ఇది నిజమైతే, సుదీక్ష అపహరణకు గురయ్యి ఉండవచ్చు అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అలాగే బీచ్ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోంది. అపహరణ జరిగిందా? – కొన్ని అనుమానాస్పద సంఘటనలు ఉండటంతో, పోలీసులు ఈ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పరారైన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ – రిసార్ట్ వద్ద ఉన్న కెమెరాల ద్వారా ఆమె చివరిసారి ఎక్కడ కనిపించిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్నేహితుల స్టేట్‌మెంట్లు – ఆమెతో కలిసి ట్రిప్‌కు వెళ్లిన స్నేహితులను విచారిస్తున్నారు. భారత ప్రభుత్వం, అమెరికా అధికారులు ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870