📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Indian Climber Dies: అనారోగ్యంతో ఎవరెస్టుపైనే మరణించిన భారతీయుడు

Author Icon By Vanipushpa
Updated: May 16, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్(Everst) శిఖరంపై మరో పర్వతారోహకుడు ప్రాణాలు విడిచారు. ఎవరెస్ట్ శిఖరం నుంచి దిగుతుండగా ‘ఆల్టిట్యూడ్ సిక్‌నెస్’ లక్షణాలతో బాధపడుతూ భారత్‌(Bharath) లోని పశ్చిమ బెంగాల్‌(West Bengal)కు చెందిన 45 ఏళ్ల సుబ్రతా ఘోష్ (Subrathaa Goose)మరణించారు. ఆయన 8,848.86 మీటర్ల (29,032 అడుగులు) ఎత్తులో, ఎవరెస్టుకు సమీపంలో ఉన్న ప్రమాదకరమైన హిల్లరీ స్టెప్ ప్రాంతం దిగువ భాగంలో చనిపోయారు. ఈ క్లైంబింగ్ సీజన్‌(Climing Season)లో ఎవరెస్టుపై సంభవించిన రెండో మరణం ఇది అని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘కృష్ణనగర్-స్నోవీ ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్ 2025’ పర్వతారోహణ సంఘం ఆధ్వర్యంలో సుబ్రతా ఘోష్ గత శనివారం(మే 10న) మధ్యాహ్నం 2 గంటలకు ఎవరెస్టుపైకి చేరుకున్నారు. అయితే అత్యంత ఎత్తులో ఉన్నందున, అక్కడి నుంచి దిగే క్రమంలో తీవ్ర అలసటకు గురయ్యారు. దీంతో ఇక పర్వతం నుంచి కిందికి దిగలేనని సుబ్రతా ఘోష్ చెప్పారు.

సుబ్రతా ఘోష్ ఎవరెస్టు నుంచి కిందికి దిగలేకపోయారు
‘కిందికి దిగండి’ అని షెర్పా గైడ్ చంపల్ తమాంగ్ పదేపదే చెప్పినా సుబ్రతా ఘోష్ తిరస్కరించారు. దీంతో చంపల్ తమాంగ్ గురువారం (మే 15న) రాత్రి ఒంటరిగా క్యాంప్ IVకు తిరిగి చేరుకున్నారు. సుబ్రతా ఘోష్ ఎవరెస్టు నుంచి కిందికి దిగలేకపోయారనే విషయాన్ని శుక్రవారం తెల్లవారుజామున అందరికీ తెలియజేశారు. సుబ్రతా ఘోష్ మృతదేహాన్ని ఎవరెస్టు బేస్ క్యాంప్‌నకు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆయన మరణానికి అసలు కారణమేంటి? అనేది పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత తెలియనుంది.
ఫిలిప్పీన్స్‌‌కు చెందిన పర్వతారోహకుడు కూడా!
ఈ వారం ప్రారంభంలోనే ఫిలిప్పీన్స్‌‌కు చెందిన పర్వతారోహకుడు 45 ఏళ్ల ఫిలిప్ II శాంటియాగో ఎవరెస్టు శిఖరానికి కొంచెం దిగువన ఉన్న సౌత్ కోల్‌లో ఉన్న క్యాంప్ IVలో మరణించారు. ఆయన బుధవారం (మే 14న) క్యాంప్ IVకు చేరుకునే సమయానికి బాగా అలసిపోయారు. తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటూ ప్రాణాలు విడిచారు. సుబ్రతా ఘోష్, ఫిలిప్ II శాంటియాగో ఇద్దరూ స్నోవీ హారిజన్ ట్రెక్స్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాహస యాత్రలలో కలిసి పాల్గొన్నారు.
విజయవంతంగా ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరుకున్న 50 మంది
ఎవరెస్టులో 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న హిల్లరీ స్టెప్ ప్రాంతాన్ని డెత్ జోన్‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరెస్టు శిఖరానికి చేరుకుని, అక్కడి నుంచి తిరిగి రావడానికి ప్రయత్నించే పర్వతారోహకులకు హిల్లరీ స్టెప్ ప్రమాదకర మైలురాయిగా పరిణమిస్తోంది. ఈ క్లైంబింగ్ సీజన్‌లో నేపాల్ పర్యాటక శాఖ ఎవరెస్ట్‌ను ఎక్కడానికి 459 అనుమతులు మంజూరు చేసింది. 100 మందికిపైగా పర్వతారోహకులు తమ షెర్పా గైడ్‌లతో కలిసి ఇప్పటికే ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఈ వారంలోనే 50 మందికిపైగా పర్వతారోహకులు విజయవంతంగా శిఖరాన్ని అధిరోహించారు.

Read Also: Donald Trump :“భారత్, పాక్ వార్ నేనే ఆపించాను”..ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu dies on Everest Due To illness Google News in Telugu Indian man Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.