📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

America: అమెరికాలో దొరికిపోయిన పదివేలమందికిపైగా భారతీయులు

Author Icon By Vanipushpa
Updated: July 2, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) కి అక్రమ వలస వెళ్తూ ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యలో 10,382 మంది భారతీయు(Indians)లు దొరికిపోయారు. వీరిలో 30 మంది మైనర్లు కూడా ఉన్నారు. అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన వారిలో అత్యధికంగా గుజరాత్‌(Gujarat) రాష్ట్రానికి చెందిన వారున్నారు. ఈ డేటాను అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం విడుదల చేసింది. ఇటీవల కాలంలో అమెరికా సరిహద్దుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావడంతో అక్రమ వలసదారులను భారీ సంఖ్యలో అరెస్టులు చేస్తున్నారు.

US: అమెరికాలో దొరికిపోయిన పదివేలమందికిపైగా భారతీయులు

గత ఏడాదితో పోల్చితే వలసల సంఖ్య తగ్గింది
గతేడాది ఇదే సీజన్‌లో మొత్తం 34,535 మంది భారతీయులు అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డారు. ఈ లెక్కన 2025లో సుమారు 70శాతం తగ్గుదల నమోదైంది. రోజుకు సగటున 69 మంది అరెస్ట్‌ అయ్యారు. ఇదే జోబైడెన్‌ హయాంలో రోజుకు 230 వరకు అరెస్ట్‌ అయ్యేవారు. ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను అమెరికా చేర్చే గ్యాంగ్‌లు తమ కార్యకలాపాలను తగ్గించాయి.

వదిలేసిన మైనర్లు – పౌరసత్వ ఆశలతో తల్లిదండ్రుల నిర్ణయం

2024 ఆర్థిక సంవత్సరంలో తల్లిదండ్రులు వదిలేసిన 500 మైనర్లను అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. -మెక్సికో, కెనడా సరిహద్దుల్లో చాలా మంది తమ పిల్లలకైనా అగ్రరాజ్య పౌరసత్వం వస్తుందన్న ఆశతో వారిని వదిలేసి వెళ్లేవారు. కానీ, ట్రంప్‌ అధికారం చేపట్టాక ఇలా పిల్లలను వదిలేయడంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తరచూ ఇక్కడ అధికారులు గుర్తించే పిల్లల వయస్సు 12 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఉంటోంది. ఏప్రిల్‌ 2024 నాటికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ లెక్కల ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నారు.

Read Also: Virgin Australia: వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో పాము కలకలం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu child migrants Indian origin Google News in Telugu Gujaratis caught at US border illegal immigration crackdown illegal immigration data CBP Indian illegal immigrants US Indian minors US border Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump immigration policy undocumented Indians deportation undocumented Indians in America US border arrests 2025 US Mexico border Indians

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.