📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

AICWA: పాకిస్థానీ న‌టుల‌పై బ్యాన్‌కు భారతీయ సినీ సంఘం పిలుపు..కారణం?

Author Icon By Vanipushpa
Updated: May 8, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి భారత సైన్యం ఇటీవ‌ల‌ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్ ’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తర్వాత కొందరు పాకిస్థానీ న‌టీన‌టులు ఇండియ‌న్‌ ఆర్మీ చేసిన దాడిని త‌ప్పుబ‌డుతూ పోస్టులు పెట్టారు. ముఖ్యంగా పాకిస్థానీ నటులైన‌ ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ ఆప‌రేష‌న్ సింధూర్ పై స్పందిస్తూ.. మహీరా ఖాన్ భారత సైన్యం చర్యను ‘పిరికి చర్య’ అని అభివర్ణించగా, ఫవాద్ ఖాన్ ఉగ్రవాదాన్ని ఖండించకుండా భారతదేశ వైఖరిని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆల్ ఇండియా సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ (AICWA) ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి వ్యాఖ్యలు దేశానికి, ఉగ్రవాదానికి బలైన అమాయక ప్రజలకు, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు అవమానకరమని పేర్కొంది.

AICWA: పాకిస్థానీ న‌టుల‌పై బ్యాన్‌కు భారతీయ సినీ సంఘం పిలుపు..కారణం?

పాకిస్థానీ కళాకారులను గుడ్డిగా నమ్మవద్దు
భారతీయ చలనచిత్ర పరిశ్రమ పాకిస్థానీ కళాకారులను గుడ్డిగా సమర్థించడాన్ని మానుకోవాలని ఏఐసీడ‌బ్ల్యూఏ కోరింది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిని, కళ పేరుతో ప్రోత్సహించడం జాతీయ గౌర‌వాన్ని అవమానించడమేనని అభిప్రాయపడింది. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ తమ దేశానికి మద్దతు తెలుపుతున్న పాకిస్థానీ కళాకారులకు భారతీయ కళాకారులు మద్దతు ఇవ్వడం సరికాదని హితవు పలికింది.
నిర్మాతలు, ఫైనాన్షియర్లపై ఏఐసీడ‌బ్ల్యూఏ నిషేధం
భారతీయ కళాకారులు ఎవ‌రూ కూడా పాకిస్థానీ న‌టుల‌తో కలిసి పనిచేయకూడదని, ఏ అంతర్జాతీయ వేదికను వారితో పంచుకోకూడదని స్పష్టం చేసింది. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిల‌బ‌డ‌దామ‌ని ఏఐసీడ‌బ్ల్యూఏ కోరింది. ఇప్పటికే పాకిస్థానీ కళాకారులు, నిర్మాతలు, ఫైనాన్షియర్లపై ఏఐసీడ‌బ్ల్యూఏ పూర్తి నిషేధం విధించింది. కాగా, గతంలో కూడా ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించాలని డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఈ డిమాండ్లు మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇతర సంఘాలు, ప్రముఖుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. అయితే, ఏఐసీడ‌బ్ల్యూఏ మాత్రం తమ డిమాండ్‌ను గట్టిగానే వినిపిస్తోంది.

Read Also: All-Party Meeting: ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu calls for ban Google News in Telugu Indian Film Association Latest News in Telugu Pakistani actors..reason? Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.