📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Modi: భారత రైతులకు నష్టం కలిగించలేం..అమెరికాకు చెప్పిన మోదీ

Author Icon By Vanipushpa
Updated: June 23, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్- అమెరికా(India-America) మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఓ కొలిక్కి రావడంలేదు. తాజాగా అగ్రరాజ్యం అమెరికా(America) కొన్ని డిమాండ్లను భారతదేశం(India) ముందు పెట్టింది. అయితే ఆ డిమాండ్లను కేంద్రంలోని మోదీ సర్కారు(Modi Govt) అంగీకరించలేదు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన చర్చలు ఆగిపోయాయి. కాగా మొక్కజొన్న(Corn), సోయాబీన్ (Soyabean) వంటి దిగుమతులపై సుంకాలను తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు కోరుతోంది. అయితే ఈ నిర్ణయం భారత రైతులకు, వినియోగదారులకు నష్టం కలిగిస్తుందని భారత ప్రభుత్వం భావిస్తోంది.

Modi: భారత రైతులకు నష్టం కలిగించలేం..అమెరికాకు చెప్పిన మోదీ

టారిఫ్ పై భారత్ అభ్యంతరం
రైతుల ఆశలను పణంగా పెట్టలేం : ఇక అమెరికా నుండి వచ్చే జన్యుపరంగా మార్పు చేసిన ఆహార పదార్థాల (GM foods)పై ఆరోగ్యపరమైన ఆందోళనలు కూడా భారత్ పరిశీలిస్తోంది. ఈ అంశం కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి అడ్డంకిగా మారింది. దేశంలోని 140 కోట్ల మంది వినియోగదారులు, రైతుల ఆశలను పణంగా పెట్టలేమని భారత్ ఖరాఖండిగా చెప్పేసింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించిన 100% బేస్‌లైన్ టారిఫ్ పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది అన్ని దేశాలకు ఒకే విధంగా వర్తిస్తుంది కనుక, భారత్‌కు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కలిగే అవకాశం లేదని మోదీ సర్కారు భావిస్తోంది.
ఇదే విషయమై లండన్ లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఒప్పందం కుదిరే సమయంలో అది రెండు పక్షాలకు లాభదాయకంగా ఉండాలి.
భారతదేశానికి భారంగా పన్ను
భారతదేశానికి భారంగా మారే అవకాశం : ఇక జూలై 9 నాటికి ఒప్పందం కుదరకపోతే, ట్రంప్ సర్కారు అమలు చేయనున్న 26% ప్రతిస్పందన పన్ను (reciprocal tariff) భారతదేశానికి భారంగా మారే అవకాశం ఉంది. ఈ నిర్ణయం భారత పరిశ్రమలు అమెరికాలో 26% వరకు దిగుమతి సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితిని తీసుకురావొచ్చు.
అమెరికాకు భారత ప్రభుత్వ షరతులు
భారత ప్రభుత్వం గట్టిగానే కండీషన్: అమెరికాతో ఒప్పందం కుదిరిన తర్వాత అగ్రరాజ్యం భవిష్యత్‌లో ఎటువంటి కొత్త సుంకాలు విధించకూడదని భారత ప్రభుత్వం గట్టిగానే కండీషన్ పెడుతోంది. అయితే ఈ అంశంపై ఇప్పటికీ అమెరికా నుంచి స్పష్టత రాలేదు. ఈ సందర్భంలో అమెరికాతో వాణిజ్యపరమై చర్చల్లో పురోగతి ఇప్పట్లో కనిపించే ఛాయలు కనపడటం లేదు. కాని అమెరికా మాత్రం త్వరగా చర్చలు ముగియాలని కోరుకుంటోంది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాయాది దేశంతో భారత్ తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ తానే ఆపేశానని స్టేట్ మెంట్ ఇవ్వడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
భారత్ తీవ్ర అభ్యంతరం
అమెరికా తమ దేశంలో ఉత్పత్తి అయిన మొక్కజొన్న, సోయాబీన్ వంటి జన్యుపరంగా మార్పులు చేసిన పంటలను భారత్ మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. దేశంలోని రైతులపై దీని ప్రభావం పడుతుందని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా పంటల ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచివేస్తే దేశీయ రైతుల జీవనోపాధికి పెద్ద దెబ్బ తగులుతుందని ఖరాఖండిగా చెబుతోంది.అందువల్ల రైతులకే మా తొలి ప్రాధాన్యం ఇస్తామని మోదీ సర్కారు స్పష్టం చేస్తోంది. భారత నిబంధనల ప్రకారం ఇవి జన్యుమార్పిడి లేదని (నో GM) సర్టిఫికేట్ లేకుండా దేశంలోకి అనుమతించబడవు.

Read Also: B-2 Bombers : యూఎస్ కు సేఫ్ తిరిగొచ్చిన B-2 బాంబర్లు

#telugu News Ap News in Telugu be Breaking News in Telugu formers Google News in Telugu harmed Indian Latest News in Telugu modi not Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to us

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.