📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

New zealand: రూ.10 కోట్ల మేర టోకరా వేసిన భారత దంపతులకు శిక్ష

Author Icon By Vanipushpa
Updated: May 20, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూజిలాండ్‌(New zealand)లో భారత సంతతికి చెందిన నేహా శర్మ(Neha Sharma), అమన్‌దీప్ శర్మ(Anudeep Sharma) అనే దంపతులు అక్కడి ప్రభుత్వ శిశు సంక్షేమ సంస్థ(Govt Child Welfare) ‘ఒరంగ తమరికీ’కి భారీగా కుచ్చుటోపీ పెట్టారు. సుమారు 2 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.10 కోట్లకు పైగా) మోసం చేసినట్లు వీరిపై ఆరోపణలు రుజువయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నేహా శర్మకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మోసం ద్వారా ఆర్థిక లబ్ధి పొందడం, మనీలాండరింగ్, నకిలీ పత్రాల వినియోగం వంటి పలు అభియోగాలను ఆమె అంగీకరించారు. ఆమె భర్త అమన్‌దీప్ శర్మ కూడా మోసం, మనీలాండరింగ్ ఆరోపణలను అంగీకరించినట్లు సమాచారం.

New zealand: రూ.10 కోట్ల మేర టోకరా వేసిన భారత దంపతులకు శిక్ష

నకిలీ ఉద్యోగ ధృవపత్రాలను సమర్పించి ఉద్యోగం
వివరాల్లోకి వెళితే, నేహా శర్మ ‘ఒరంగ తమరికీ’ సంస్థలో ప్రాపర్టీ అండ్ ఫెసిలిటీస్ మేనేజర్‌గా పనిచేసేవారు. ఆమె భర్త అమన్‌దీప్ ‘డివైన్ కనెక్షన్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను నడిపేవారు. నేహా శర్మ నకిలీ ఉద్యోగ ధృవపత్రాలను సమర్పించి 2021లో ఈ సంస్థలో చేరారు. తన అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని, భర్త కంపెనీకి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారు. 2021 జూలై నుంచి 2022 అక్టోబరు మధ్య కాలంలో, సుమారు 200కు పైగా నిర్వహణ పనులను, 326 పెంచిన ధరలతో కూడిన ఇన్వాయిస్‌లను భర్త కంపెనీకి మళ్లించారు. తామిద్దరూ భార్యాభర్తలమన్న విషయాన్ని సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకురాకుండా ప్రయోజనాల వైరుధ్యం నిబంధనలను ఉల్లంఘించారు.
బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు
2022 అక్టోబరులో ఒకే కాంట్రాక్టర్‌కు పదేపదే పనులు అప్పగించడంపై అనుమానం రావడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విచారణకు హాజరు కావాల్సి ఉండగా, దంపతులిద్దరూ వ్యాపార తరగతి విమానంలో చెన్నైకి పారిపోయారు. అయితే, కొద్దికాలంలోనే వారిని పట్టుకుని న్యూజిలాండ్‌కు రప్పించారు. వారి వద్ద మూడు ఆస్తులు, మూడు కార్లు, బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ‘ఒరంగ తమరికీ’ సంస్థ ప్రకటించింది.

Read Also: Gaza: గాజాలో 14 వేల శిశువుల ప్రాణాలకు ముప్పు: ఐరాస

#telugu News Ap News in Telugu Breaking News in Telugu for embezzling Google News in Telugu Indian couple Latest News in Telugu Paper Telugu News Rs. 10 crore sentenced for Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.