విదేశాల్లో స్థిరపడిన భారతీయులు(NRI) తమ కష్టార్జితాన్ని దేశానికి పంపడంలో సరికొత్త రికార్డు సృష్టించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అందిన విదేశీ చెల్లింపులు (రెమిటెన్స్‌లు) ఏకంగా 135.46 బిలియన్ డాలర్ల(Dollar)కు చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది 14 శాతం అధికమని ఆర్‌బీఐ(RBI) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్
విదేశాల నుంచి సొమ్మును స్వీకరించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం(India in top Place)లో నిలిచింది. ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్తలు రూపొందించిన నివేదిక ప్రకారం, 2024 క్యాలెండర్ ఇయర్‌లో భారత్‌కు 129.4 బిలియన్ డాలర్ల చెల్లింపులు అందాయి. ఈ జాబితాలో 68 బిలియన్ డాలర్లతో మెక్సికో(Mexico) రెండో స్థానంలో, 48 బిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉన్నాయి. ఫిలిప్పీన్స్ (40 బిలియన్ డాలర్లు), పాకిస్థాన్ (33 బిలియన్ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఉద్యోగ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం ప్రధాన కారణం
ఈ భారీ పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేశాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత అమెరికా సహా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) దేశాల్లో ఉద్యోగ మార్కెట్లు తిరిగి పుంజుకోవడం ప్రధాన కారణంగా నిలిచింది. దీనికి తోడు విదేశాలకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1990లో 66 లక్షలుగా ఉన్న ప్రవాస భారతీయుల సంఖ్య, 2024 నాటికి 1.85 కోట్లకు చేరింది. వీరిలో దాదాపు సగం మంది గల్ఫ్ దేశాల్లోనే పనిచేస్తున్నారు. ఈ విదేశీ చెల్లింపులను ఆర్‌బీఐ ప్రైవేట్ బదిలీలుగా వర్గీకరించింది. 2024-25 జనవరి-మార్చి త్రైమాసికంలోనే భారత్‌కు 33.9 బిలియన్ డాలర్లు అందాయి.
Read Also: Shinawatra: థాయిల్యాండ్ ప్రధాని షినవత్రాపై సస్పెన్షన్