📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India: మైనారిటీల హక్కులపై బంగ్లాదేశ్​ను హెచ్చరించిన భారత్

Author Icon By Vanipushpa
Updated: April 18, 2025 • 1:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ బెంగాల్​ హింసపై బంగ్లాదేశ్ అధికారులు చేసిన వ్యాఖ్యలను భారత్ గట్టిగా​ తిప్పికొట్టింది. భారత్​కు ధర్మోపదేశాలు చేసే బదులు, బంగ్లాదేశ్​లో ఉన్న మైనారిటీల హక్కులను పరిరక్షించడంపై దృష్టి పెట్టాలని చురకలు అంటించింది. “పశ్చిమ బెంగాల్​లో జరిగిన ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను మేము తిరస్కరిస్తున్నాం. బంగ్లాదేశ్​లోని మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు బంగ్లాదేశ్​ ఆడుతున్న కపట నాటకం ఇది. నిజంగా మైనారిటీలపై దాడులు చేస్తున్న నేరస్థులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కనుక అనవసర వ్యాఖ్యలు చేయడం, ధర్మోపదేశాలు ఇవ్వడం కంటే, మీ బంగ్లాదేశ్​లోని మైనారిటీలను రక్షించడంపై దృష్టి పెట్టడం మంచిది.”

భారత్​పై నోరు పారేసుకున్న యూనస్​
బంగ్లాదేశ్​ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్​ ప్రెస్​ సెక్రటరీ షఫీకుల్ ఆలం గురువారం భారత్​పై నోరు పారేసుకున్నారు. “పశ్చిమ బెంగాల్​లోని ముస్లింలపై జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. ఈ దాడుల వల్ల చాలా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. భారత్​, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు మైనారిటీ ముస్లింను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి.”

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు
నిరసనలు చేపట్టారు. దీనితో ముర్షిదాబాద్ సహా పశ్చిమ బెంగాల్​లోని పలు ప్రాంతాల్లో గతకొన్ని రోజులుగా మతపరమైన హింస చెలరేగింది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన వచ్చిన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్​ ప్రభుత్వం గత ఆగస్టు నెలలో ఆశ్రయం ఇచ్చింది. ఇది ప్రస్తుత యూనస్ ప్రభుత్వానికి ఏ మాత్రం నచ్చడం లేదు. దీనితో ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి. యూనస్​ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశంలో మైనారిటీలుగా హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది.

Read Also: China: చైనా సంచలన నిర్ణయం.. ఎల్‌ఎన్‌జీ దిగుమతుల నిలిపివేత

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu India warns Bangladesh Latest News in Telugu over minority rights Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.