📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

India vs England: తొలి టెస్ట్ ఉచితంగా ఎక్కడ చూడాలంటే?

Author Icon By Anusha
Updated: June 19, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఇంగ్లండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. డబ్ల్యూటీసీ 2027 (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) కొత్త ఎడిషన్‌కి ఇది తొలి సిరీస్ కావడం విశేషం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఈ సిరీస్‌పై మరింత ఆసక్తి నెలకొంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ (Shubman Gill captaincy) లో టీమిండియా కొత్త శకాన్ని ప్రారంభించబోతుంది.శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుంది. అయితే లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌ భారత కాలమానం ప్రకారం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ ఛానెల్‌లో మ్యాచ్‌లు వస్తాయి, ఫ్రీగా ఎలా చూడాలనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మ్యాచ్ వివరాలు ఇలా

భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ హెడింగ్లీలోని లీడ్స్ మైదానం వేదికగా జరగనుంది. శుక్రవారం(జూన్ 20) ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరగనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఈ మ్యాచ్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా టీమిండియా ఆడే తొలి సిరీస్ ఇదే.భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. అరగంట ముందుగానే టాస్ వేయనున్నారు. ఈ మ్యాచ్‌లను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar) , సోనీ లివ్‌ (Sony Liv) తో పాటు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్‌లో చూడవచ్చు. డీడీ స్పోర్ట్స్‌ (DD Sports) లో ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. సాధారణంగా విదేశీ గడ్డపై జరిగే మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్‌లో ప్రసారం చేయరు. కానీ ఈ సిరీస్‌ను ఫ్రీగా ప్రసారం చేయనున్నారు.

India vs England

బరిలోకి దిగే తుది జట్లు

ఈ మ్యాచ్‌‌కు బరిలోకి దిగే తుది జట్టును ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఇప్పటికే ప్రకటించింది. 11 మంది సభ్యుల వివరాలను వెల్లడించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. భారత్ (India) తమ తుది జట్టును ఇంకా ప్రకటించలేదు. టాస్ సమయంలోనే వెల్లడించే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), క్రిస్ వోక్స్, జోష్ టోంగ్, బ్రైటన్ కార్స్, షోయబ్ బషీర్.భారత్ తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రిసిధ్ కృష్ణ.

Read Also: Gautam Gambhir: కర్మ వదిలిపెట్టదని.. గంభీర్‌కు పేసర్ సెటైర్?

#EnglandCricket #INDvsENG #ShubmanGill #TeamIndia #TestCricket #WTC2027 Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.