📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

India vs England : మహిళల టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఎక్కడచూడొచ్చంటే?

Author Icon By Anusha
Updated: June 28, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం నాటింగ్‌హామ్ వేదికగా

భారత మహిళల క్రికెట్ జట్టు మరో సవాలుతో ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమైంది. ఐదు టీ20లతో పాటు మూడు వన్డేలు కలిగిన ఈ సిరీస్‌లో భాగంగా, హర్మన్‌ప్రీత్ కౌర్ (Harman Preet Kaur) నాయకత్వంలోని జట్టు తొలి టీ20 మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ శనివారం (జూన్ 29) నాటింగ్‌హామ్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.ఇప్పటికే భారత మహిళల జట్టు ఇంగ్లండ్ చేరి సన్నాహకాలు పూర్తి చేసుకుంది. జూలై 1, 4, 9, 12న తర్వాతి నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగనుండగా జూలై 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది.భారత్, ఇంగ్లండ్ మహిళల టీ20, వన్డేల సిరీస్‌లకు సోనీ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ స్పోర్ట్స్1 ఛానెల్‌తో పాటు సోనీ లైవ్ యాప్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ మ్యాచ్‌లను చూడవచ్చు. అయితే ఫ్రీగా చూడాలంటే జియో యూసర్జ్ జియో టీవీ (Jio TV) యాప్‌లో సోనీ స్పోర్ట్స్ 1 ఛానెల్ సెలెక్ట్ చేసుకోని చూడాలి. ఎయిర్టెల్ యూజర్స్ ఎయిర్టెల్ టీవీ యాప్‌లో చూడవచ్చు.

ఈ సిరీస్ ప్రాధాన్యత ఎంతో

ఈ పర్యటన భారత మహిళల జట్టు కోసం కీలకం కానుంది. ఇటీవల మంచి ఫార్మ్‌లో ఉన్న టీమిండియా, ఇంగ్లండ్ జట్టును వారి సొంత గడ్డపైనే ఎదుర్కొనబోతుండడం మరో సవాల్. ముఖ్యంగా టీ20 సిరీస్‌ (T20 series) ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ సిరీస్ ప్రాధాన్యత ఎంతో ఉంది.ఇంగ్లండ్ వేదికగా ఆడటమంటే ఖచ్చితంగా పరిస్థితులకు అనుగుణంగా మెలగడం చాలా ముఖ్యం. పిచ్‌లు సాధారణంగా స్వింగ్‌కు అనుకూలంగా ఉండటం, వాతావరణం చల్లగా ఉండటం భారత ఆటగాళ్లకు కొంత సవాలుగా మారవచ్చు.

India vs England

భారత జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రాధా యాదవ్, దీప్తి శర్మ(Deepti Sharma), అరుంధతి రెడ్డి, శ్రీ చరాణి, యస్తికా భాటియా, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రానా, సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్.

ఇంగ్లండ్ జట్టు

నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంకెల్, డెనియెల్ వ్యాట్-హాడ్జ్, అమీ జోన్స్, ఆలిస్ క్యాప్సీ, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సీ స్మిత్, లారెన్ బెల్, లారెన్ ఫిలర్, ఇస్సీ వాంగ్, పైజ్ షాఫీల్డ్, టామీ బ్యూమాంట్, ఎం ఆర్లాట్. భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన (England Tour) తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేస్తుందా అనే ఆసక్తికర ప్రశ్నకు శనివారం రాత్రి సమాధానం దొరుకుతుంది. రెండు బలమైన జట్లు మైదానంలో తలపడనున్న నేపథ్యంలో అభిమానులకు గొప్ప క్రికెట్ విందు లభించనుంది. ఈ సిరీస్ ద్వారా భారత్ తమ గ్లోబల్ స్థాయిని మరింత పటిష్టం చేసుకుంటుందా అన్నది చూడాలి!

Read Also: Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024లో మమ్మల్ని హోటల్ నుంచి బయటకు రానివ్వలేదన్న రోహిత్ శర్మ

#HarmanpreetKaur #INDvsENG #INDWCricket #womenscricket Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.