📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India vs England: తొలి టెస్టులో ఆడే టీమిండియా తుది జట్టు ఇదే?

Author Icon By Anusha
Updated: June 19, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డబ్ల్యూటీసీ 2027 (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) ఎడిషన్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. శుక్రవారం(జూన్ 20) లీడ్స్ వేదికగా మొదలయ్యే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా (Team India) ఈ సిరీస్ ఆడనుంది. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ నేపథ్యంలో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్‌లకు అవకాశం దక్కింది. అయితే తొలి టెస్ట్‌లో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముఖ్యంగా టెస్ట్‌ క్రికెట్‌క వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. 

నాలుగో స్థానం

తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. అనుభవంతో పాటు స్వింగ్ బాల్స్‌ను సమర్థవంతంగా ఆడగలిగే నైపుణ్యం కలిగిన కేఎల్ రాహుల్‌‌‌ను ఓపెనర్‌గా ఆడించనుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా కలిసిరానుంది. మూడో స్థానంలో సాయి సుదర్శన్, నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్, ఐదో స్థానంలో కరుణ్ నాయర్ బరిలోకి దిగనున్నారు. అయితే కరుణ్ నాయర్‌ (Karun Nair) కు గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. నెట్స్‌లో ప్రసిధ్ కృష్ణ వేసిన బంతి కరుణ్ నాయర్ పక్కటెముకలకు బలంగా తాకింది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా లేదని తెలుస్తున్నా ముందస్తు చర్యల్లో భాగంగా పక్కనపెట్టవచ్చనే అభిప్రాయం కలుగుతోంది.

బ్యాటింగ్

ఒకవేళ కరుణ్ నాయర్‌ ఆడకపోతే అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ లేదా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగవచ్చు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ అవసరం అనుకుంటే వాషింగ్టన్ సుందర్‌ను ఆడించవచ్చు.వికెట్ కీపర్ రిషభ్ పంత్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం పంత్‌ (Rishabh Pant) ను అప్‌ది ఆర్డర్ ఆడించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఏకైక స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆడనుండగా పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగనున్నాడు. ఇంట్రా‌స్క్వాడ్ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈక్రమంలోనే నితీష్ స్థానంలో శార్దూల్‌ను ఆడించనున్నారు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణలు ఆడనున్నారు.

India vs England

కండిషన్స్ నేపథ్యంలో

ఇంగ్లండ్ కండీషన్స్ నేపథ్యంలో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడనుంది. ఓ పేస్ ఆల్‌రౌండర్ నాలుగో బౌలర్‌గా సేవలందించనున్నాడు. ఇక ఇద్దరు స్పిన్నర్లు కావాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు ఓ బ్యాటర్‌పై వేటు పడుతుంది. కానీ కండిషన్స్ నేపథ్యంలో ఒక్క స్పిన్నర్‌తోనే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.భారత్ తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్/ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ.

భారత జట్టు

ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు:శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్.

Read Also: India vs England: తొలి టెస్ట్ ఉచితంగా ఎక్కడ చూడాలంటే?

#INDvsENG #TeamIndia #TestCricket #WTC2027 Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.