📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

???????? and ????????: భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం..ఆశాజనక సంకేతాలు!

Author Icon By Vanipushpa
Updated: April 16, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట్రంప్ విధించిన పరస్పర సుంకాలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్(BTA) కోసం భారతదేశం – అమెరికా త్వరలోనే చర్చలను ప్రారంభించనున్నాయి. అయితే ఈ చర్చలు వర్చువల్ మోడ్‌లో జరుగనున్నాయి. ఈ విషయంపై భారత బృందం కూడా వచ్చే నెలలో అమెరికాకు వెళ్లనుంది. ఈ ఒప్పందం మొదటి దశను ఈ సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ నాటికి అమలు అయ్యేలా, దీనికంటే ముందే చర్చలు పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ అన్నారు.
లక్ష్యం: $500 బిలియన్ ట్రేడ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 9 నుండి ప్రపంచ దేశాలపై పరస్పర సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసందే. అయితే తరువాత దానిని 90 రోజులు అంటే జూలై 9 వరకు వాయిదా వేశారు. భారతీయ వస్తువులపై అమెరికా 26% సుంకం విధించింది. దీనిపైనే ఈ చర్చలు కొనసాగనున్నాయి. మరోవైపు 2030 నాటికి బైలాటరల్ ట్రేడ్ $500 బిలియన్లకు తీసుకెళ్లడానికి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి ఫిబ్రవరి 13న భారతదేశం – అమెరికా అంగీకరించాయి. వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చలు ఈ వారం వర్చువల్ మోడ్‌లో ప్రారంభమవుతాయి అని మంత్రిత్వ శాఖ అధికారి కూడా తెలిపారు. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ మే రెండవ వారంలో భౌతికంగా చర్చలు ప్రారంభమవుతాయి అని అన్నారు.

అమెరికాతో ఇండియా మంచి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్
మార్చి నెల ఎగుమతి గణాంకాల పై సమాచారం ఇస్తూ వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ సుంకాలన్ని పరిశీలిస్తే భారతదేశానికి ఆందోళన కలిగించే విషయాలు ఇంకా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికాతో ట్రేడ్ లిబరలైజేషన్ దిశగా భారతదేశం ఇప్పటికే అడుగులు వేసింది. అమెరికాతో ఇండియా మంచి బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటుందని ఆశిస్తున్నాము అని అన్నారు. భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై నెక్స్ట్ రౌండ్ చర్చలు మే 12న ప్రారంభమవుతాయి. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ చర్చలు వస్తువులు, సేవలు, పెట్టుబడులు ఇంకా ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ వంటి రంగాలపై దృష్టి సారించాయని అలాగే చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని అన్నారు.
డంపింగ్ ప్రమాదం – మానిటరింగ్ సెల్ ఏర్పాటైంది
అమెరికా పరస్పర సుంకాలు భారతదేశం కంటే ఎక్కువగా ఉండటం వల్ల చైనా, వియత్నాం వంటి దేశాల నుండి వస్తువులను భారతదేశంలో డంప్ చేసే ప్రమాదం ఉన్నందున, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితిలో దిగుమతులు పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని మానిటరింగ్ టీంని ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా అసాధారణ దిగుమతులు గమనించినట్లయితే, మేము తగిన చర్య తీసుకుంటాము అని అన్నారు. వాణిజ్య లిబరలైజేషన్ వైపు భారత్ ఇప్పటికే అడుగులు వేసిందని వాణిజ్య కార్యదర్శి తెలిపారు. ఒక మంచి, సముచిత వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో చర్చలు రేటుగా సాగనున్నాయి.

Read Also: Canada: కెనడాను 51వ రాష్ట్రంగా గుర్తించేందుకు ట్రంప్ యత్నాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu hopeful signs! India-US trade agreement Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.