📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India: మయన్మార్‌కు రోబోటిక్స్‌ మ్యూల్స్‌ను, నానో డ్రోన్లను పంపిన భారత్‌

Author Icon By Vanipushpa
Updated: April 12, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మయన్మార్‌కు భారత్‌ ఫుల్ భరోసా! రోబోటిక్ మ్యూల్స్‌, నానో డ్రోన్స్‌తో రెస్క్యూ ఆపరేషన్‌
ఇటీవల తీవ్ర భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాండలే, నేపిడాలో రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా శోధిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే “ఆపరేషన్‌ బ్రహ్మను” ప్రారంభించిన భారత్‌, తాజాగా రెస్క్యూ ఆపరేషన్‌ కోసం నాలుగు కాళ్లుండే రోబోటిక్స్‌ మ్యూల్స్‌ను, నానో డ్రోన్లను పంపింది. వీటి సాయంతో శిథిలాల కింద వెతుకుతున్నారు. సిబ్బంది వెళ్లలేని చోటుకి వీటిని పంపి గాలిస్తున్నారు.

3,600 మందికి పైగా మరణాలు
మయన్మార్‌లో గత నెల 28న సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా 3,600 మందికి పైగా మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే శిథిలాల్లో చిక్కుకున్న వారిని భద్రతా బృందాలు వెలికితీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా రెస్క్యూ ఆపరేషన్‌ కోసం భారత ఆర్మీకి చెందిన సిబ్బంది అధునాతన సామగ్రిని వినియోగిస్తున్నారు. నాలుగు కాళ్లుండే రోబోటిక్స్‌ మ్యూల్స్‌తో శిథిలాల కింద వెతుకుతున్నారు. నానో డ్రోన్లతోనూ అణువణువూ గాలిస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
వందల టన్నుల ఆహారాన్నిసరఫరా
భారత్‌ ఇప్పటికే ఆపరేషన్‌ బ్రహ్మలో భాగంగా 31 టన్నుల సామగ్రిని సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానంలో మయన్మార్‌కు పంపింది. మాండలేలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత ఆర్మీ ఆసుపత్రికి అవసరమైన సామగ్రిని కూడా అందజేసింది. భారత సైన్యానికి చెందిన ఫీల్డ్‌ ఆసుపత్రి భూకంప క్షతగాత్రులకు వైద్య సేవలను అందిస్తోంది. భారత నౌకాదళానికి చెందిన “ఐఎన్‌ఎస్‌ ఘరియాల్‌” వందల టన్నుల ఆహారాన్ని తిలావా ఓడరేవుకు చేర్చింది. గతనెల 28న రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు మయన్మార్‌ పూర్తిగా అతలాకుతలమైంది. దీనితో ఆ దేశానికి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకువచ్చాయి.

Read Also: Donald Trump: ట్రంప్ వైద్య రికార్డులపై సర్వత్రా ఆసక్తి!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu India sends robotic mules Latest News in Telugu nano drones to Myanmar Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.