📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

India: భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్

Author Icon By Vanipushpa
Updated: June 23, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌(Iran) యుద్ధంలోకి అమెరికా(America) ఎంట్రీ కావడం- గేమ్‌ఛేంజర్‌ అవుతుందా? దాడులు చేసిన తర్వాత, ట్రంప్‌ శాంతిమంత్రం జపించినా, అంతా కూల్‌ అవుతుందా? ప్రపంచం మీద ఇరాన్‌ కొత్తగా దాడులు చేయాల్సిన అవసరం లేదు. క్రూడాయిల్‌ సరఫరా ఆపేస్తామంటే చాలు, మనం హడలిపోతాం.. ఎందుకంటే, క్రూడాయిల్‌ సరఫరాను ఇరాన్‌ ఆపేస్తే, అంతర్జాతీయంగా సమస్య వస్తుంది. ఒకవైపు హార్ముజ్‌(Hormuz) జలసంధి మార్గం మూసివేత.. మరోవైపు క్రూడాయిల్‌ నిలిపివేతతో.. ధరలు అమాంతం పెరిగితే, మనదేశంలోనూ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ (Hardeep Singh) కీలక ప్రకటన చేశారు.

India: భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్

ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదన్నారు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దేశంలోని చమురు కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయని, వివిధ మార్గాల ద్వారా ఇంధన సరఫరాలు నిరంతరాయంగా అందుతున్నాయన్నారు కేంద్రమంత్రి.
పశ్చిమాసియా ఘర్షణలతో ముడిచమురు గండం
‘‘హార్ముజ్‌ మార్గం బందైనా భారత్‌కి ఇబ్బంది లేదు.. వేరే మార్గాల్లో భారత్‌కు క్రూడాయిల్‌ వస్తుంది.. 2 మిలియన్‌ బారెళ్లలోపే హార్ముజ్‌ గుండా దిగుమతి చేసుకుంటాం.. భారత్‌కు వేరే మార్గాలనుంచి 4 మిలియన్‌ బారెళ్ల క్రూడాయిల్‌ వస్తుంది. మన కంపెనీల దగ్గర మూడువారాల నిల్వలు ఉన్నాయి.. ఇతర మార్గాల్లో క్రూడాయిల్‌ దిగుమతిపై దృష్టి పెడతాం’’.. అంటూ కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పేర్కొన్నారు.
మొత్తంగా.. పశ్చిమాసియా ఘర్షణలతో ముడిచమురు గండం ఏర్పడింది. అమెరికా దాడులతో క్రూడాయిల్‌ ధరలు భగ్గుమన్నాయి.. 78 డాలర్లకు పైగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ట్రేడవుతోంది.. అయితే.. చమురు ధరలు పెరిగితే సామాన్యుడిపై భారం తప్పదని పేర్కొంటున్నారు. ఒకవైపు చర్చలకు అవకాశం ఉందంటూ… మరోవైపు దాడులు చేస్తుండటం అమెరికా వాస్తవ అభిప్రాయాన్ని సందేహాస్పదంగా చేస్తోంది. దీని వెనుక “సైనిక బలంలో తక్కువదనాన్ని ఉపయోగించుకోవాలన్న” వ్యూహం ఉందని విమర్శకుల అభిప్రాయం.

Read Also: Marco Rubio: ఇరాన్ శాంతిని కోరుకుంటే అందుకు సిద్ధం: రూబియో

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu hardeep singh india Latest News in Telugu No oil Paper Telugu News storage Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.