టర్కీ కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ మానవతాదృక్పథంతో ఆదుకుంది. కానీ టర్కీ(Turkey) మాత్రం మన చిరకాల శత్రువు పాకిస్థాన్(Pakistan) కు సపోర్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారీగా డ్రోన్లు, మిలిటరీని పంపించింది. దీంతో భారత్ లో టర్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. బాయికాట్ టర్కీ నినాదం ఉవ్వెత్తున ఎగిసింది. అయితే తాజాగా టర్కీకి మరో ఊహించని షాక్ ఇచ్చింది భారత్.
టర్కీకి కోలుకోలేని దెబ్బ
టర్కీకి భారత్ ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. చేసిన సాయం మరచి పాకిస్థాన్ కు కాపు కాసిన టర్కీకి కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. టర్కీ ఎయిర్ లైన్స్ తో భారత్ కు చెందిన ఇండిగో ఎయిర్ లైన్స్ ఒప్పందం రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మూడు నెలల్లో ఇరు సంస్థల మధ్య ఉన్న ట్రావెల్ ఒప్పందం రద్దు చేసుకోవాలని సూచనలు చేసింది.
టర్కీకి చెందిన సెలెబ్ ఏవియేషన్ అనే వైమానిక సంస్థ భారత్ లోని 9 కీలక ఎయిర్ పోర్టుల్లో సేవలు అందిస్తోంది. దిల్లీలోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టు కూడా లిస్టులో ఉంది. అయితే కొన్ని వారాల క్రితం సెలెబ్ ఏవియేషన్ సంస్థకు సెక్యూరిటీ క్లియరెన్స్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా ఎయిర్ ఇండియా సంస్థను కూడా సెలెబ్ ఏవియేషన్ తో ఉన్న ఒప్పందం రద్దు చేసుకోవాలని సూచనలు చేసింది. 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని విజ్ఞప్తి చేసింది కేంద్ర ప్రభుత్వం.
టర్కిష్ ఎయిర్ లైన్స్ తో ఒప్పందం తక్షణమే రద్దు
టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చెందిన రెండు బోయింగ్ 777 విమానాలను ఎయిర్ ఇండియా లీజుకు తీసుకుని నడుపుతోంది. అయితే ఇటీవల లైసెన్సు పూర్తి కాగా లైసెన్సు మరో 6 నెలలు పొడిగించాలని కేంద్ర వైమానిక శాఖ వద్ద దరఖాస్తు పెట్టుకుంది ఎయిర్ ఇండియా. అయితే ఈ రిక్వెస్ట్ ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ క్రమంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ తో ఒప్పందం తక్షణమే రద్దు చేసుకోవాలని ఎయిర్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎయిర్ ఇండియా మాత్రం.. తక్షణమే అంటే బుకింగ్స్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతాయని 3 నెలలు గడువు కావాలని కోరగా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆగస్టు 31 లోపు ఇరు సంస్థల మధ్య జీరో సంబంధాలు ఉండాలని స్పష్టం చేసింది.
పహల్గాం ఉగ్రదాడిని ఖండించక పోవడమే కాకుండా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ ఫుల్ సపోర్ట్ చేసిన టర్కీకి ఈ విధంగా భారత్ బుద్ధి చెబుతోంది. ఇప్పటికే బాయికాట్ టర్కీ నినాదం సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. టర్కీకి చెందిన అనేక వస్తువులను భారత్ బ్యాన్ చేసింది. టర్కీ నుంచి దిగుమతులు నిలిపివేసింది. తాజాగా ఎయిర్ లైన్స్ కూడా రద్దు కానున్న నేపథ్యంలో టర్కీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు.
Read Also: Donald Trump : చైనాపై మరోసారి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు