📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Bangladesh: బంగ్లాదేశ్‌లో అధికారం మార్పులతో భారత్‌కు కొత్త తలనొప్పి

Author Icon By Vanipushpa
Updated: April 19, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో అధికారం చేతులు మారినప్పటి నుంచి ఆ దేశంతో సంబంధాలు భారత్‌కు కాస్త ఇబ్బందిగానే ఉంటున్నాయి. గత ఏడాది ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోవాల్సివచ్చింది. అప్పటికి 15ఏళ్లుగా షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను పరిపాలిస్తున్నారు. ఆమె దేశం వీడిన తర్వాత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉన్నారు. షేక్ హసీనా పదవీకాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలుండేవి. కానీ, గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి.
తీవ్ర ఉద్రిక్తతను పెంచిన నిర్ణయాలు
భారత్ నుంచి పోర్టుల ద్వారా నూలు (ఉన్ని లేదా పత్తి దారాలు) దిగుమతిని ఇటీవల బంగ్లాదేశ్ నిలిపివేసింది. బంగ్లాదేశ్ జాతీయ రెవెన్యూ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లోని బెనాపోల్, భోమారా, సోనమస్జిద్, బంగ్లాబంధ, బురిమారి ఓడరేవులలో అమలవుతోంది. బంగ్లాదేశ్‌కు భారత్ నుంచి నూలు దిగుమతి అయ్యే పోర్టులు ఇవే. భారత విమానాశ్రయాలు, పోర్టుల ద్వారా భారతీయ వస్తువుల ఎగుమతులతో పాటు బంగ్లాదేశ్ ఎగుమతులకు వీలుకల్పించే ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని కొద్దిరోజుల క్రితం భారత్ ఉపసంహరించుకుంది. రద్దీ భారీగా ఉండడం దీనికి కారణమని భారత్ తెలిపింది.

భారత్, బంగ్లాదేశ్ సంబంధాలపై రణధీర్ జైస్వాల్‌ స్పందన
” బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని భారత్ కోరుకుంటోంది. ప్రజాస్వామ్య, సమ్మిళిత, సంపన్న బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఉన్నాం. ఓడరేవులు, విమానాశ్రయాలలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించాం. అయితే మేం ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన పరిణామాలను కూడా గమనించాలని కోరుతున్నాను” అని గురువారం( ఏప్రిల్ 17) భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ భారత్, బంగ్లాదేశ్ సంబంధాలపై స్పందిస్తూ అన్నారు.
ఇటీవల చైనా వెళ్లిన ముహమ్మద్ యూనస్ అక్కడ చేసిన ఒక ప్రకటన వివాదాస్పదమయింది. ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలను బంగ్లాదేశ్‌ ల్యాండ్‌లాక్ (చుట్టుముట్టడం) చేసిందని, ఈ ప్రాంతంలో సముద్రానికి ఏకైక సంరక్షణగా బంగ్లాదేశ్ మాత్రమే ఉందని, అక్కడ ఆర్థిక కార్యకలాపాలను పెంచాలని చైనాకు విజ్ఞప్తి చేశారు. “రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని కలుషితం చేసే ప్రకటనలు చేయవద్దు” అని యూనస్‌తో మోదీ చెప్పారని బ్యాంకాక్‌లో ఇద్దరు నేతల చర్చల తర్వాత భారత ప్రభుత్వం తెలిపింది. చైనాలో యూనస్ చేసిన ప్రకటనను ఉద్దేశించే భారత్ ఈ విషయం చెప్పింది.
భారత భద్రతకు ఆందోళన
ఇది జరుగుతుండగానే భారత సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండే లాల్‌మోనిర్హాట్ వైమానిక స్థావరాన్ని చైనా, పాకిస్తాన్ సాయంతో బంగ్లాదేశ్ పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఇది భారత భద్రతకు ఆందోళన కలిగించే అంశం. ముహమ్మద్ యూనస్ చైనా పర్యటన సందర్భంగా ఈ వైమానిక స్థావరం గురించి చర్చించారని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ తెలిపింది. ఈ ప్రణాళికలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉందని వార్తలు వచ్చాయి.

ముహమ్మద్ యూనస్ ఏమంటున్నారు?
భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయన్న చర్చ కూడా ఊపందుకుంది. భారత్‌తో సంబంధాల గురించి ముహమ్మద్ యూనస్ కొన్ని వారాల కిందట బీబీసీ బంగ్లాతో మాట్లాడారు. “మా సంబంధాలు ఏ విధంగానూ క్షీణించలేదు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అవి భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాయి. భారత్, బంగ్లాదేశ్ చాలా దగ్గరి దేశాలు. ఒకదేశంపై మరొకటి చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాయి. చారిత్రకంగా, రాజకీయంగా, ఆర్థికంగా మాకు చాలా దగ్గర సంబంధాలున్నాయి. వాటినుంచి పక్కకు వెళ్లలేం.” అని అన్నారు.

Read Also: Florida University: ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in Bangladesh India faces new headache Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today with change of power

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.