📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందు నేత హత్యను ఖండించిన భారత్

Author Icon By sumalatha chinthakayala
Updated: April 19, 2025 • 6:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bangladesh : బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విదేశాగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఒక ప్రకటన చేశారు.

ఇంట్లోంచి అపహరించి, దారుణంగా హత్య

హిందూ మైనారిటీ నేత భబేశ్ చంద్ర రాయ్‌ను ఇంట్లోంచి అపహరించి, దారుణంగా హత్య చేసినట్టు మా దృష్టికి వచ్చింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో ఇది మరొకటి. ఈ దాడిని మేము ఖండిస్తు్న్నాం. గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన వారు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనారిటీలను రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని మరోసారి గుర్తుచేస్తున్నాం అని రణ్‌ధీర్ జైశ్వాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ ఫోన్ కాల్ ఆయన భార్య శాంతన రిసీవ్ చేసుకున్నారు

కాగా, 58 ఏళ్ల బభేశ్ చంద్ర రాయ్‌ను ఇంటి నుంచి అపహరించి, కొట్టి చంపినట్టు ఓ పత్రిక తెలిపింది. ఆ కథనం ప్రకారం, బభేశ్ చంద్రరాయ్ ఇంటికి గురువారం ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఆయన భార్య శాంతన రిసీవ్ చేసుకున్నారు. బబేశ్ ఇంట్లోనే ఉన్నారని ఆమె చెప్పడంతో ఒక అరగంట తర్వాత నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి బబేష్‌ను తమవెంట నరబరి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనపై దారుణంగా దాడిచేశారు. స్పృహ కోల్పోయిన దశలో ఇంటికి చేర్చడంతో ఆయనను కుటుంబసభ్యలు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందారు. బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషత్‌ బిరాల్ యూనిట్‌కు రాయ్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు.

Read Also : అఫ్గాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

bangladesh Breaking News in Telugu Google news Google News in Telugu Hindu leader India condemns Latest News in Telugu Paper Telugu News Randhir Jaiswal Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.