📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India Canada: దౌత్యవేత్తల పునర్‌ నియామకానికి భారత్, కెనడా గ్రీన్ సిగ్నల్

Author Icon By Vanipushpa
Updated: June 18, 2025 • 3:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దౌత్యవేత్తల పునర్​ నియామకంపై భారత్- కెనడా మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా(Canada)కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi), ఆ దేశ ప్రధాని మార్క్​ కార్నీ(Mark Carney)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగానే ఈ దౌత్యవేత్తల పునర్​ నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో గత రెండేళ్లుగా పతనమవుతూ వస్తున్న ఇరుదేశాల సంబంధాలు బలోపేతయమయ్యే అవకాశం ఉంది.

India Canada: దౌత్యవేత్తల పునర్‌ నియామకానికి భారత్, కెనడా గ్రీన్ సిగ్నల్


సాధారణ సేవలను పునరుద్ధరించే లక్ష్యంతో..
ఇరుదేశాల పౌరులు, వ్యాపారాలకు సాధారణ సేవలను పునరుద్ధరించే లక్ష్యంతో కొత్త హై కమిషనర్లను నియమించడానికి అంగీకరించినట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. ఈ సమావేశం ముఖ్యమైనదని భావిస్తున్నానని అన్నారు. జీ7 అధ్యక్షుడిగా ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇక జీ7 ఎజెండాలోని ముఖ్య అంశాలైన అంతర్జాతీయ నేరాలు, అణచివేత, భద్రత గురించి ప్రధాని మార్క్ కార్నీ ప్రస్తావించారు. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్​ఫర్మేషన్, ఆహార భద్రత, కీలకమైన ఖనిజాల్లో సహాకరం పెంచుకోవడంపై చర్చలు జరిగాయి.
జీ7 సందర్భంగా కెనడా, భారత్ ప్రధానుల మధ్య సానుకూల, నిర్మాణాత్మక సమావేశం జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘ఈ భేటీలో ఇరుదేశాల భాగస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం, న్యాయపాలన వంటి అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య బలోపేతమైన చర్యలకు అడుగులు పడ్డాయి. అందులో మొదటిది హై కమిషనర్ల పునర్ నియామకం’ అని ప్రకటనలో ఉంది.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి
2023లో ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్‌ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే కెనడా-భారత్ రాయబారులను వెనక్కి పిలిపించారు. కెనడాలో ఉగ్రవాదం, భారత్ వ్యతిరేక కార్యకలాపాలపై భారత్​ పదేపదే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాంటి శక్తులపై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరుతోంది.

Read Also: Europe: యూరప్‌లో చౌకగా విహరించదలచిన వారికోసం టాప్ 5 దేశాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu canada give green signal Google News in Telugu india Latest News in Telugu Paper Telugu News reassignment of diplomats Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.