📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: టెస్ట్ చరిత్రలో ఇరు జట్ల తరఫున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లు ఎవరంటే?

Author Icon By Anusha
Updated: June 7, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లాండ్, భారత్  జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 4 వరకు జరిగే ఈ సిరీస్‌లో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. రికార్డుల పరంగా సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)తరచుగా అగ్రస్థానంలో కనిపిస్తున్నప్పటికీ భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసి టాప్-5 ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో లేడు కానీ ఇంగ్లాండ్ ఆటగాడు సచిన్ కంటే పైన ఉన్నాడు.భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీరే,

జోరూట్: ఈ లెజెండరీ ఇంగ్లాండ్ బ్యాటర్ 2012 నుంచి 2024 వరకు భారత్‌పై మొత్తం 30 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో జో రూట్(Joe Root) 55 ఇన్నింగ్స్‌లలో 58.08 సగటుతో 2846 పరుగులు చేశాడు. ఈ కాలంలో జో రూట్ బ్యాట్ నుంచి 10 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు వచ్చాయి.

సచిన్ టెండూల్కర్: 1990-2012 వరకు భారత్‌లోని ఈ గొప్ప బ్యాటర్ ఇంగ్లాండ్‌తో 32 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 51.73 సగటుతో మొత్తం 2535 పరుగులు చేశాడు. ఈ కాలంలో మాస్టర్-బ్లాస్టర్ 7 సెంచరీలు, 13 అర్థ శతకాలు సాధించాడు.

సునీల్ గవాస్కర్: ఈ జాబితాలో మాస్టర్-బ్లాస్టర్ రెండో స్థానంలో ఉండగా లిటిల్ మాస్టర్ మూడో స్థానంలో ఉన్నాడు. లెజెండరీ కెప్టెన్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) 1971-1986 మధ్య ఇంగ్లాండ్‌తో 38 టెస్టులు ఆడాడు. ఈ కాలంలో సునీల్ గవాస్కర్ 4 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు సాధించాడు. 38.20 సగటుతో 2483 పరుగులు చేశాడు.

అలిస్టర్ కుక్: ఈ మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ 2006 నుంచి 2018 వరకు భారత్‌తో 30 టెస్టులు ఆడాడు. ఈ సమయంలో అలిస్టర్ కుక్ 54 ఇన్నింగ్స్‌లలో 47.66 సగటుతో 2431 పరుగులు చేశాడు. కుక్ తన టెస్ట్ కెరీర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు సాధించాడు.

విరాట్ కోహ్లీ: టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ 2012-2022 మధ్య ఇంగ్లాండ్‌తో 28 టెస్టులు ఆడాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) 42.36 సగటుతో 1991 పరుగులు చేశాడు. ఈ జట్టుపై విరాట్ కోహ్లీ 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు.

Read Also: French Open: ఫైనల్‌కు చేరిన అల్కరాస్, సినర్

#Alistair Cook #Joroot #Sachin Tendulkar #Sunil Gavaskar #TestSeries2025 #Virat Kohli Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.