📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: ఓటమిపై బెన్ స్టోక్స్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 10:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 336 పరుగుల భారీ తేడాతో గెలిచి, ఐదు టెస్టుల అండర్సన్-సచిన్ ట్రోఫీలో 2-0 లీడ్‌ను సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారకుడిగా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌పై తనదైన ముద్ర వేసిన గిల్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌటైంది. ఆకాశ్ దీప్(6/99) సంచల బౌలింగ్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బెన్ స్టోక్స్ (Ben Stokes), టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడాన్ని సమర్థించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని తెలిపాడు. ముఖ్యంగా రెండు తప్పిదాలు తమ విజయవకాశాలను దెబ్బతీసాయని చెప్పాడు. ‘ఈ మ్యాచ్‌లో రెండు క్షణాలు కీలకంగా మారాయి.

కొద్దీ పరిస్థితులు

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 200/5 కట్టడి చేసినప్పుడు మేం చాలా సంతోషించాం. కానీ వారిని త్వరగా ఆలౌట్ చేయలేకపోయాం. మా బ్యాటింగ్ (Batting) సమయంలో 80 పరుగులే 5 వికెట్లు కోల్పోయాం. అక్కడి నుంచి తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. ఈ రెండు తప్పిదాలే మా విజయవకాశాలను దెబ్బతీసాయి.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కష్టమైన నిర్ణయమే. కానీ నేను ముందుగా చెప్పినట్లు ప్రత్యర్థిని 200/5 కట్టడి చేశాం. అప్పుడు అందరూ సంతోషించారు. కానీ ఆట జరుగుతున్నా కొద్దీ పరిస్థితులు మా కంటే భారత్‌కే ఎక్కువ అనుకూలించాయి. ఈ మ్యాచ్‌లో మా కంటే భారత పేసర్లు మెరుగైన ప్రదర్శన చేయడంపై ఎలాంటి ఆందోళన లేదు. మేం కూడా ప్రతిదీ ప్రయత్నించాం. ప్రణాళికలను మార్చాం. జట్టు విజయం కోసం చేయగలిగినదంతా చేశాం. కానీ ప్రత్యర్థి ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు తిరిగి మూమెంటమ్ అందుకోవడం చాలా కష్టం. అది వరల్డ్ బెస్ట్ టీమ్ (World best team) అయిన భారత్‌పై మరీ కష్టం.

IND vs ENG: ఓటమిపై బెన్ స్టోక్స్ ఏమన్నారంటే?

అసాధారణ బ్యాటింగ్‌

శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు. అసాధారణ బ్యాటింగ్‌తో మా పతనాన్ని శాసించాడు. సుదీర్ఘమైన మ్యాచ్‌లో ఆఖరి రోజు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. మా ఆటగాళ్లంతా పూర్తిగా అలసిపోయారు. అయితే ఇది మళ్లీ మళ్లీ ఎదుర్కొనే పరిస్థితి. ఇందుకు అలవాటు పడాలి. జెమీ స్మిత్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందకున్నా, బ్యాట్‌తో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సహజమైన ఆటతో చెలరేగుతున్నాడు. హ్యారీ బ్రూక్ (Harry Brook) ఆడిన విధానం అద్భుతం. అతని ప్రదర్శన మా విజయానికి సరిపోకపోయినా గొప్పది. ఈ ఓటమి గురించి చర్చిస్తాం. ఈ వారం మాకు కఠినంగా గడిచింది. . లార్డ్స్‌లో ఎలా పుంజుకుంటామో చూడాలి.’అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Akash Deep : ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక విజయం!

#AkashDeep #AndersonSachinTrophy #AshesStyleSeries #BenStokes #CricketHighlights #CricketNews #CricketUpdate #DoubleCentury #EdgbastonTest #EnglandCricket #ENGvsIND #GillMasterclass #IndianBatting #IndiaWins #PlayerOfTheMatch #ShubmanGill #TeamIndia #TestCricket #TestSeries2025 Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.