📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: షాహిద్ అఫ్రిది ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశగా జైస్వాల్

Author Icon By Anusha
Updated: June 30, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం (Edgbaston Stadium) లో ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. టీమిండియా ఈ టెస్ట్ సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది. గత తప్పులను మరిచిపోయి రెండో టెస్ట్‌లో తిరిగి పుంజుకోవాలని జట్టు భావిస్తోంది. తొలి టెస్ట్‌లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ఒక ప్రపంచ రికార్డు సృష్టించే దిశగా ఉన్నాడు. లీడ్స్ టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. కానీ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. జైస్వాల్ షాహిద్ అఫ్రిది ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరు మీద ఉంది. షాహిద్ అఫ్రిది 46 ఇన్నింగ్స్‌లలో తన టెస్ట్ క్రికెట్‌లో 50 సిక్సర్లు పూర్తి చేశాడు. యశస్వి జైస్వాల్ విషయానికొస్తే, అతను టెస్ట్ క్రికెట్‌లో 38 ఇన్నింగ్స్‌లలో 40 సిక్సర్లు కొట్టాడు. 

రెండో టెస్ట్‌

యశస్వి జైస్వాల్ మరో 10 సిక్సర్లు కొట్టి అఫ్రిది ప్రపంచ రికార్డును తన పేరు మీద నమోదు చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ జట్టుపై యశస్వి టెస్ట్ రికార్డు బాగుంది. జైస్వాల్ ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లలో 27 సిక్సర్లు కొట్టాడు. ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు అతను ఇదే జట్టుపై కొట్టాడు. అతను రెండో టెస్ట్‌లో 10 సిక్సర్లు కొట్టలేకపోయినా ఈ రికార్డును బ్రేక్ చేయడానికి అతనికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. షాహిద్ అఫ్రిది (Shahid Afridi) రికార్డును బ్రేక్ చేయడానికి యశస్వి జైస్వాల్ 7 ఇన్నింగ్స్‌లలో 10 సిక్సర్లు కొట్టాలి.టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్ రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. రోహిత్ శర్మ 51 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

IND vs ENG:

ఇంతకు ముందు

రోహిత్ శర్మను యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు టెస్ట్‌లో ఆడిన 20 మ్యాచ్‌లలో 38 ఇన్నింగ్స్‌లలో 1903 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 2000 టెస్ట్ పరుగులు పూర్తి చేయడానికి కూడా దగ్గరగా ఉన్నాడు. టెస్టుల్లో యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు 5 సెంచరీలు, 10 అర్థ సెంచరీలు సాధించాడు.భారత్ ఇంతకు ముందు ఈ మైదానం (Stadium) లో 8 టెస్టులు ఆడింది. వాటిలో 7 ఇంగ్లాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. టీమిండియా ఈ టెస్టులో గెలిస్తే ఇది ఈ మైదానంలో భారత జట్టుకు మొదటి విజయం అవుతుంది.

Read Also: AB de Villiers: భారత జట్టు పై ఏబీ డివిలియర్స్ తీవ్ర అసంతృప్తి..కారణమేంటంటే?

Ap News in Telugu Breaking News in Telugu Edgbaston cricket match Google News in Telugu IND vs ENG 2025 news IND vs ENG 2nd Test 2025 India England Test match July 2 India Test series updates Indian batting lineup Jaiswal Test century Jaiswal vs England stats Latest News in Telugu Paper Telugu News Shahid Afridi fastest runs record Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Yashasvi Jaiswal record

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.