📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND vs ENG: 3-1 తేడాతో గెలవడం పక్కా : సచిన్ టెండూల్కర్

Author Icon By Anusha
Updated: June 20, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆడబోయే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సంబంధించి తన అభిప్రాయాన్ని వెల్లడించిన మాస్టర్ బ్లాస్టర్ భారత్ విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. భారత్ జట్టు ఈ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఈ సిరీస్ భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభాన్ని సూచిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు.భారత టెస్ట్ క్రికెట్‌ (Test cricket) లో నవశకం ఆరంభమవుతున్న తరుణంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టులో యువ ఆటగాళ్లతో కూడిన నూతన బ్యాటింగ్ లైనప్ బరిలోకి దిగనుంది.

యువతలో ఉన్న ఎనర్జీ

ఇది టీమిండియాకు ఎంతో కీలకమైన సిరీస్. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజాల తరువాత, ఇది మొదటి పెద్ద సిరీస్. ఈ నేపథ్యంలో టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) నాయకత్వంలోని జట్టుపై భారీ భారం ఉంటుంది. అయినా సరే, యువతలో ఉన్నఎనర్జీని దృష్టిలో పెట్టుకుని ఈ టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించగలరని సచిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, “ఈ సిరీస్‌లో భారత్ 3-1 తేడాతో గెలుస్తుందని నేను భావిస్తున్నాను” అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. జ‌స్ప్రీత్ బుమ్రా పనిభారంపై కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, ఈ పర్యటనలో అతడే భారత జట్టుకు ప్రధాన పేస్ బౌలర్ (స్ట్రైక్ బౌలర్) అవుతాడని సచిన్ అభిప్రాయపడ్డాడు.

సహాయక బౌలర్లు

ఇంగ్లాండ్ పర్యటనలో జ‌స్ప్రీత్ బుమ్రా కీల‌క పాత్ర‌ను స‌చిన్‌ వివరిస్తూ “భారత బౌలింగ్ విభాగం చాలా వరకు బుమ్రా ప్రదర్శనపైనా, అతనికి మిగతా బౌలర్లు ఎలా సహకరిస్తారన్న దానిపైనా ఆధారపడి ఉంటుంది. బుమ్రా (Jasprit Bumrah) నిస్సందేహంగా మన ప్రధాన బౌలర్. అతడితో పాటు నా అనుభవం ప్రకారం ప్రసిద్ధ్ కృష్ణ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, నితీశ్ రెడ్డి (Nitish Reddy) వంటివారు సహాయక బౌలర్లుగా ఉంటారు. 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టులో సచిన్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ సిరీస్ తర్వాత భారత్ ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ గెలవలేదు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌కు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. శుభ్‌మన్ గిల్‌ 32 మ్యాచ్‌లు ఆడిన తర్వాత భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా మారాడు.

IND vs ENG

విజయవంతం

ఈ పర్యటనలో శుభ్‌మన్ గిల్‌ అద్భుతమైన ప్రదర్శన చేస్తారని సచిన్ టెండూల్కర్ నమ్ముతున్నారు. ఇంగ్లండ్‌ (England) లో విజయవంతం కావడానికి సచిన్ టెండూల్కర్ సూత్రాన్ని కూడా వివరించారు. అక్కడి పరిస్థితులు బ్యాటింగ్ చేయడానికి కఠినంగా ఉంటాయని ఆయన అన్నారు.భారత్ తరఫున ఆడటం ఒక పెద్ద బాధ్యత అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. నేను కొన్ని పేర్లు మరిచిపోయి ఉండొచ్చు. హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. మన బౌలింగ్ దళం సమతూకంగా ఉందని నేను భావిస్తున్నాను. మనం ఖచ్చితంగా మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాను” అని స‌చిన్‌ తెలిపాడు.

ప్రజలకు అతనిపై

భారత్ కోసం ఆడటమే ఒక బాధ్యత అని ఏ స్థానంలో బ్యాటింగ్ (Bating) చేసినా ఆ పరుగులు చాలా అమూల్యమైనవని తెలిపారు. 11వ నంబర్ కూడా వేరే సామర్థ్యంలో బాధ్యతను నిర్వర్తిస్తుందన్నారు. ఆ(నంబర్ 4) బాధ్యతను గిల్ నిర్వర్తించగలడని ప్రజలు నమ్మడం మంచి విషయమన్నారు. ప్రజలకు అతనిపై ఉన్న అంచనాలు సానుకూల సంకేతమని ఎందుకంటే ప్రజలకు అతనిపై నమ్మకం ఉందన్నారు. గిల్ ఏదైనా ప్రత్యేకంగా చేస్తాడని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశారు.

Read Also: Shubhman Gill: విరాట్ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధమన్న శుభ్‌మన్ గిల్

#INDvsENG #SachinTendulkar #TeamIndia #TestSeries2025 Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.