ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కు సంబంధించి వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారిణి కర్నల్ సోఫియా ఖురేషి (Sofia qureshi) పై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దీంతో నేరుగా సుప్రీం కోర్టు స్వయంగా చొరవ తీసుకుని స్పందించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ D.G.P కైలాష్ మక్వానా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బృందంలో సాగర్ రేంజ్ I.G ప్రమోద్ వర్మ, భోపాల్ S.A.F డీఐజీ కల్యాణ్ చక్రవర్తి, దిందోరి జిల్లా SP వాహిణి సింగ్ ఉంటారని ప్రకటనలో తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఈ ఉదయం 10 గంటల్లోపు సిట్‌ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌కు చెందని ముగ్గురు ఐపీఎస్‌లు అందులో ఉండాలని, వారిలో ఒకరు SP ర్యాంకు కలిగిన మహిళా అధికారి ఉండాలని సూచించింది. ఈ నెల 28న తొలి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు చెప్పింది.

విజయ్ షా తీవ్ర ఆగ్రహం
అంతకుముందు సోమవారం ఈ అంశంపై విచారించిన సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పినట్లుగా లేదని, న్యాయపరమైన చిక్కులను తప్పించుకోవడానికి మొసలి కన్నీళ్లు కార్చినట్లుగా ఉందని అభిప్రాయపడింది. మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది. మంత్రి విజయ్ షాపై మధ్యప్రదేశ్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. మంత్రి వ్యాఖ్యల కారణంగా దేశం మొత్తం సిగ్గుపడిందని తెలిపింది. ఆయన మాట్లాడిన వీడియోలను చూశామని, అసభ్యకరమైన భాషను ఉపయోగించారని తీవ్ర స్థాయిలో స్పందించింది.ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనేది దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సైనిక ఆపరేషన్. ఆమె వ్యాఖ్యలపై ప్రత్యుత్తరంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతకు లోనయ్యాయి
ఆపరేషన్ సిందూర్ లో పాత్ర
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కు సంబంధించి వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషి(Sofia qureshi)ని ఉద్దేశించి మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశంతో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టింది. ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన సర్వోన్నత న్యాయస్థానం, విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది.ఈ వివాదం ఒక రాజకీయ నేత బాధ్యతారహిత వ్యాఖ్యలు ఏ స్థాయిలో దేశాన్ని దిగజార్చగలవో బలంగా చూపింది. సైనిక అధికారిణిపై వచ్చిన వ్యాఖ్యలపై దేశం స్పందించిన తీరు, న్యాయ వ్యవస్థ మోహించిన తత్వం ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఇప్పుడు మిగిలినది… న్యాయబద్ధమైన దర్యాప్తు, బాధ్యులపై తగిన చర్య.
Read Also: Ahmedabad: రెండో దఫా మొదలైన హైడ్రా కూల్చివేతలు.. భారీగా ఇళ్లు నేలమట్టం!