📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Imran Khan: అసిమ్ మునీర్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు

Author Icon By Vanipushpa
Updated: June 4, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌(Asim Munir)పై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్(Imrak Khan) సంచలన ఆరోపణలు చేశారు. మునీర్‌కు ప్రతీకార స్వభావం ఉందని, తన భార్య బుష్రా బీబీని కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్పదవి నుంచి తొలగించినందుకే మునీర్ ఇలా చేస్తున్నారని ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఖాన్, తన కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను కూడా అన్యాయంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Imran Khan: అసిమ్ మునీర్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు

ఆసిమ్‌ మునీర్‌ కు ప్రతీకార స్వభావం
ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియాలా జైలులో ఉన్నపాక్ మాజీ ప్రదాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తాను ప్రధానిగా ఉన్నప్పుడు జనరల్ మునీర్‌ను ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ (డీజీ) పదవి నుంచి తొలగించానని చెప్పారు. ఆ విషయం గురించి మాట్లాడేందుకు మునీర్.. తన భార్య బుష్రా బీబీని మధ్యవర్తుల ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాడని తెలిపారు. అయితే, బుష్రా బీబీ ఆ ప్రయత్నాన్ని తిరస్కరించిందని ఖాన్ చెప్పారు. దీనితో మునీర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడని ఆరోపణలు చేశారు. అన్యాయంగా 14 నెలల శిక్ష విధించారని, జైలులో కూడా ఆమెను సరిగా చూడటం లేదని ఖాన్ ఆరోపించారు.
ఇవి లండన్ ప్లాన్‌లో భాగమే..
తన భార్యకు రాజకీయాలతో సంబంధం లేదని, అయినా ఆమెను లక్ష్యంగా చేసుకున్నారని ఖాన్ అన్నారు. పాకిస్థాన్ నియంతృత్వ పాలనలో కూడా ఇలా జరగలేదని ఆయన ఆవేదన చెందారు. నెల రోజులుగా తన భార్యను కలవడానికి కూడా అనుమతించడం లేదని ఆయన వాపోయారు. మే 9, 2023న జరిగిన హింస (ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన రోజు) ‘లండన్‌ ప్లాన్‌’లో భాగమని ఖాన్ ఆరోపించడం గమనార్హం. ‘మే 9న జరిగిన సైనిక స్థావరాలపై దాడులు ఎక్కడి నుంచి ప్రేరితమయ్యాయన్నది ప్రజలకు తెలియకపోవచ్చు, కాని వాటికి నాటకీయ నేపథ్యం ఉంది… ఇవి లండన్ ప్లాన్‌లో భాగమే.. తాను, తన పార్టీ నేతలు, కార్యకర్తలు అన్యాయంగా అరెస్టులకు గురయ్యారు’ అని అన్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్‌పై. ఖాన్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాదు, తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఎలా వ్యక్తిగత ప్రతీకార చర్యలకు దారితీసిందో వివరిస్తూ, ఆర్మీని తీవ్రంగా ఆక్షేపించారు. ‘నిర్భందాలు, తప్పుడు కేసులు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన దౌర్జన్యాలు’ అని ఖాన్ ఆరోపించారు. ‘మా మీద పెట్టిన కేసుల్లో సాక్ష్యాలేమీ లేవు.

Read Also: Bilawal Bhutto: అంతర్జాతీయ వేదికలపై మా ప్రయత్నాలు

#telugu News against Asim Munir Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Imran Khan's Latest News in Telugu Paper Telugu News sensational allegations Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.