భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్(Pakistan) లో కీలక పరిణామం చోటుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఈ ఇన్సాన్ పార్టీ(PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్(Imran Khan) జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జూన్ 11 న ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పీటీఐ పార్టీ ఇన్ ఛార్జీ ఘోహర్ అలీ ఖాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. పాక్ లోని హైకోర్టు(High Court) ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్.. ఆయన సతీమణి భుష్రా బీబీ కు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
2023 నుంచి జైలు జీవితం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలో జైలు నుంచి బయటకు రానున్నట్లు పీటీఐ పార్టీ ఛైర్మన్ ఘోహర్ అలీ ఖాన్ తెలిపినట్లు సమాచారం అందుతోంది. ఇస్లామాబాద్ లోని హైకోర్టు ఈమేరకు జూన్ 11 న పిటిషన్లపై విచారణ జరిపి బెయిల్ ఇవ్వనున్నట్లు పీటీఐ నేతలు చెబుతున్నారు. వివిధ కేసుల్లో భాగంగా ఆయన 2023 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు.
ఇమ్రాన్ ఖాన్ తో పాటు సతీమణి బీబీ కు కూడా బెయిల్?
ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైలులో ఉంటున్నారు. అయితే ఆయనపై నమోదైన వివిధ కేసులను కొట్టివేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్లను ఇస్లామాబాద్ హైకోర్టు జూన్ 11 న విచారించనుంది. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ రానున్నట్లు పీటీఐ పార్టీ ఇన్ ఛార్జీ ఘోహర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన సతీమణి భుష్రా బీబీ కు కూడా ఈ కేసుల్లో బెయిల్ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉండటంపై అక్కడ రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను వెంటనే విడుదల చేయాలంటూ పీటీఐ నేతలు బహిరంగంగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన భారత్ వైఖరిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలని నిపుణులు అంటున్నారు.
Read Also: Pakistan: ఆత్మరక్షణకు ఆయుధాలివ్వండి..అమెరికాను కోరిన పాకిస్తాన్..!