📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ICC Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల

Author Icon By Anusha
Updated: June 18, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) ఈరోజు విడుద‌ల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ 2026 జూన్ 12న ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు, శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ప్రతిష్ఠాత్మక ట్రోఫీ కోసం పోటీపడతాయి. గ‌తేడాది ఈ ట్రోఫీని న్యూజిలాండ్ జట్టు (New Zealand team) గెలుచుకున్న విష‌యం తెలిసిందే. నెల రోజుల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో మొత్తం 33 మ్యాచ్‌లు ఇంగ్లండ్, వేల్స్‌లోని ఏడు వేర్వేరు వేదికలపై జరగనున్నాయి.

ICC Womens T20 World Cup 2026

హైవోల్టేజ్ మ్యాచ్‌

భారత క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు కూడా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌ (T20 format) లో భారత్, పాకిస్థాన్ మహిళల జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడగా, అందులో 12 సార్లు భారత జట్టే విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2024 అక్టోబర్ 6న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ మహిళల జట్టుపై భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి దాయాదుల పోరు కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Read Also: Nick Knight: గిల్‌ను ఇంగ్లండ్ లక్ష్యంగా చేసుకుంటుందన్న నిక్ నైట్

#ICCWomensT20 #T20WorldCup2026 #WomensT20WorldCup #WT20WC2026 Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.