📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Rishi Sunak: కన్నడలో నా భార్యకి ప్రపోజ్ చేశాను: బ్రిటిష్ మాజీ ప్రధాని

Author Icon By Vanipushpa
Updated: June 4, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్రిటిష్ మాజీ ప్రధాని రిషి సునక్(Rishi Sunak).. ఇన్ఫోసిస్(Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, రచయిత్రి సుధా మూర్తి(Sudha Murthi) కుమార్తె అక్షత మూర్తి(AkshithaMurthi)ని మనువాడిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా తన భార్యకు ఎలా ప్రపోజ్ చేశాననే విషయాలను పంచుకున్నాడు.. తన భార్యకి కన్నడలో ప్రపోజ్ చేశానని..అందుకు ఆమె ఆనందంగా అంగీకరించిందని చెప్పుకొచ్చారు.ఆ సమయంలో తనకు కన్నడ భాష అంతగా రాకపోయినా ఆ భాషలోనే ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

Rishi Sunak: కన్నడలో భార్యకి ప్రపోజ్ చేశాను: బ్రిటిష్ మాజీ ప్రధాని

కన్నడ సంప్రదాయంలో పెళ్లి
ఎట్టకేలకు బెంగుళూరు ఫ్యామిలీ నుండి తాను అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని దీంతో పాటు కన్నడ సంస్కృతిని కూడా స్వీకరించానని తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఇంటర్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బ్రిటిష్ మాజీ ప్రధాని రిషి సునక్ ఈ ఇంటర్యూలో మాట్లాడుతూ..ఇద్దరం స్టాన్‌ఫోర్డ్‌లో కలుసుకున్నామని చెప్పుకొచ్చారు. అనంతరం 2009లో బెంగళూరులో కన్నడ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇప్పుడు కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)కి మద్దతు
దీంతో పాటుగా క్రికెట్ కి సంబంధించిన ఆసక్తిర విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. ఇష్టమైన క్రికెటర్ గురించి మాట్లాడుతూ..విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని తెలిపారు. కాగా పెళ్లి సమయంలో అత్తమామలు అతనికి RCB జెర్సీని బహుమతిగా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

జైశంకర్ తనకు బహుమతిగా విలువైన వస్తువు

తనకు ఇండియా నుంచి లభించిన విలువైన వస్తువు గురించి కూడా సునక్ మాట్లాడారు. తాను యూకే ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తనకు బహుమతిగా బ్యాట్ ఇచ్చారని..అది ఎంతో విలువైన వస్తువు అని చెప్పారు సునక్. ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్ ఆర్సీబీని ఫైనల్లో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపిఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబికి గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు సునక్.వ్యక్తిగత అభిమానం కన్నా దౌత్య పరంగా క్రికెట్ గురించి మాజీ ప్రధాని ఎక్కువగా మాట్లాడారు. ఈ దౌత్యపరమైన సంబంధాలు ఇరుదేశాధి నేతలతో కలిసి విభేదాలను పరిష్కరించుకునే మార్గానికి నాంది పలుకుతాయన్నారు. ముఖ్యంగా యాషెస్ సిరీస్ సమయంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన వివాదాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

Read Also: Elon Musk: ట్రంప్‌ బిల్లుపై మస్క్‌ విమర్శలు
Jasbir Singh: గూఢచర్యం కేసులో యూట్యూబర్ జస్బీ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Former British Prime Minister Google News in Telugu I proposed to my wife in Kannada Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.