📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Ahmedabad: ట్రాఫిక్‌ జాంతో విమానం మిస్ అయ్యాను..భూమి చౌహాన్

Author Icon By Vanipushpa
Updated: June 13, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భూమి చౌహాన్(Bhoomi Chauhan). 30 ఏళ్ల ఈ మహిళ గురువారం తాను ఎక్కకాల్సిన విమానం తప్పిపోయినందుకు చాలా బాధపడ్డారు. ఆమె ప్రయాణించాల్సిన విమానం 242 మంది ప్రయాణికులతో లండన్‌(London)కు బయల్దేరి, కూలిపోయిన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్(Air India Dreamliner). ఈ విమానం అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విమానాన్ని అందుకునేందుకు చౌహాన్ గుజరాత్‌లోని తన సొంతపట్టణం అంకాలేశ్వర్‌నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ”మేం అహ్మదాబాద్‌కు సకాలంలోనే చేరుకున్నాం. కానీ నగరంలో ట్రాఫిక్ కారణంగా విమానాశ్రయానికి ఐదునిమిషాలు ఆలస్యంగా చేరాను. దీంతో బోర్డింగ్‌కు నన్ను అనుమతించలేదు” అని చౌహాన్ చెప్పారు. ”ముందు నేను చాలా బాధపడ్డాను. నా టిక్కెట్ డబ్బులు పోయాయి, నా ఉద్యోగం కూడా పోతుంది అని బాధపడ్డా. కానీ డబ్బులు పోతే పోయాయి. ప్రాణాలు దక్కాయి అని ఇప్పుడనిపిస్తోంది” అని ఆమె అన్నారు.

Plane Crash: ట్రాఫిక్‌ జాంతో విమానం మిస్ అయ్యాను..ఆలశ్యమే నన్ను కాపాడింది

‘ఆలస్యంగా వచ్చానని బోర్డింగ్‌కు అనుమతించలేదు’
భూమి మొదట యూకేలో చదువుకోవడానికి వెళ్లారు. తరువాత బ్రిస్టల్‌లో పనిచేసే బ్యాంకు ఉద్యోగితో రెండేళ్ల క్రితం ఆమెకు పెళ్లయింది. ”నేను యూకేలో చదువుకోవడానికి వెళ్లి పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. పెళ్లయిన రెండేళ్ల తరువాత నా స్వగ్రామం అంకాలేశ్వర్‌కు వచ్చాను. నెలన్నరగా ఇక్కడే ఉంటున్నాను. సెలవులు అయిపోయిన తరువాత తిరిగి బయల్దేరాను” అని ఆమె చెప్పారు.
ఫ్లైట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో గమనిస్తూనే ఉన్నా
ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినప్పుడు ఫ్లైట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో గమనిస్తూనే ఉన్నానని భూమి చెప్పారు. కానీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత ఆమెను బోర్డింగ్‌కు అనుమతించలేదు.
”నేను ఆలస్యంగా వచ్చానని ఎయిర్ ఇండియా సిబ్బంది చెప్పారు. బోర్డింగ్ పూర్తయిపోయిందని చెప్పడంతో విమానం ఎక్కలేకపోయాను” అని భూమి చెప్పారు.

Read Also: Israel: ఇరాన్ కీలక సైనిక నాయకులు, అణు శాస్త్రవేత్తలు హతం!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu But the delay saved me. due to traffic jams Google News in Telugu I missed my flight Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.