📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: వందల వీసాలు రద్దు.. అందులో భారత విద్యార్థులే ఎక్కువ

Author Icon By Vanipushpa
Updated: April 19, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాల కారణంగా అమెరికాలో వందలాది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్ఏ) వెల్లడించింది.
327 మంది విద్యార్థుల వీసాలు రద్దు
అది అందించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 327 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. లేదా, వారి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎస్ఈవీఐఎస్) రికార్డులు తొలగించబడ్డాయి. వీరిలో 50 శాతం మంది భారతీయులే కాగా, 14 శాతం మంది చైనాకు చెందినవారు ఉన్నారు. దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

కోర్ట్ మెట్లు ఎక్కుతున్న విద్యార్థులు
ఈ వీసా రద్దులు సమర్థనీయంగా లేవని, వీటిపై పారదర్శకత, పర్యవేక్షణ, బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా తప్పుగా తొలగించిన ఎస్ఈవీఐఎస్ రికార్డులపై విద్యార్థులకు అర్జీ వేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఏఐఎల్ఏ కోరింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ వీసా రద్దుల నేపథ్యంలో చాలామంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో కోర్టులను ఆశ్రయించారు. వీసాలు రద్దయిన విద్యార్థులను వారి స్వదేశాలకు పంపించకుండా నిలుపుదల ఆదేశాలివ్వాలంటూ న్యాయమూర్తులను అభ్యర్థించారు. మాసాచుసెట్స్, మోంటానా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వాషింగ్టన్ డీసీ రాష్ట్రాల్లోని న్యాయమూర్తులు అత్యవసరంగా విద్యార్థుల పరిరక్షణకు ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థులపై కేసులకు వెనుకాడని ట్రంప్
వీసా రద్దయిన విద్యార్థుల్లో భారతదేశానికి చెందిన క్రిష్ ఇస్సర్‌దాసాని అనే 21 ఏళ్ల యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మెడిసన్‌కి చెందిన అండర్‌ గ్రాడ్యుయేట్ విద్యార్థి కూడా ఉన్నాడు. నవంబర్‌లో ఓ బార్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో జరిగిన వాగ్వివాదం నేపథ్యంలో అతడిని ‘డిసార్డర్‌‌లీ కండక్ట్‌’ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో అధికారం మార్పులతో భారత్‌కు కొత్త తలనొప్పి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Hundreds of visas cancelled Latest News in Telugu most of them for Indian students Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.