📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Pahalgam Attack: 42 ఉగ్ర శిక్షణ కేంద్రాలు .. వందల సంఖ్యలో ముష్కరులకు శిక్షణ

Author Icon By Vanipushpa
Updated: April 24, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జిత్తులమారి పాక్‌.. భారత్‌కు వ్యతిరేకంగా టెర్రర్ డెన్‌లు రన్ చేస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఏకంగా 42 ఉగ్ర శిక్షణ కేంద్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి ఎల్‌ఓసీ సమీపంలోనే ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ట్రైనింగ్ క్యాంప్‌లలో వందల సంఖ్యలో ముష్కరులు శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. పహల్గామ్‌ సమీపంలోని పర్యాటక కేంద్రం బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడితో ఆ వివరాలు బయటపెట్టాయి నిఘావర్గాలు.

లోయలో 70 నుంచి 75 మంది ఉగ్రవాదులు
నియంత్రణ రేఖకు సమీపంలోని పీఓకేలో.. 42 ట్రైనింగ్ క్యాంపుల్లో 115 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వీరిలో 115 మంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు. వాళ్లకి 15మంది లోకల్స్‌ అన్ని రకాలుగా సహాయ సహాకారాలు అందిస్తున్నారు. కశ్మీర్ లోయలో 70 నుంచి 75 మంది ఉగ్రవాదులు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇక జమ్ము, రాజౌరీ, పూంచ్‌ రీజియన్లలో 60 నుంచి 65 మంది ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు భద్రతా సంస్థలు చెబుతున్నాయి.
విదేశీ ఉగ్రవాదుల మకాం ఇక్కడే
ఇక జమ్మూ కశ్మీర్‌లో 56మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారు. వీళ్లలో ఎక్కువగా ఉన్నది లష్కరే తోయిబా ముఠా సభ్యులే. 18 మంది జైషే మహమ్మద్‌.. 35మంది లష్కరే తోయిబా.. ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన వాళ్లున్నారు. మరో 17మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదులతో పొలిస్తే లోకల్ టెర్రరిస్టుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే ఎక్కువ సంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
పహల్గామ్‌లో అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్‌ ఉంటుంది. ఇప్పటికే ఆ.. యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఉగ్రదాడి కలకలం రేపింది. అయితే కశ్మీర్ చుట్టూ మకాం వేసిన ఉగ్రవాదులు ఏ క్షణమైనా విరుచుకుపడుతారనే అనుమానాలు ఉన్నాయి. వాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. ఏరివేత ముమ్మరం చేయాలని భావిస్తున్నాయి భద్రతా బలగాలు.
ప్రతీకర చర్యలకు భారత్ సిద్ధం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకర చర్యలకు సిద్ధమైన భారత్ .. త్వరలో పీఒకే లో టెర్రరిస్ట్‌ల టార్గెట్‌గా ఆపరేషన్‌ చేపట్టాలని భావిస్తోంది.. గతంలో ఉరి,పుల్వామా ఘటనలకు కౌంటర్‌ గా సర్జికల్ స్ట్రైక్‌, ఎయిర్ స్ట్రైక్ తరహాలలో ఆపరేషన్స్ చేయనుంది.. ఉగ్రదాడి సూత్రధారులు, పాత్ర ధారులను వదిలే ప్రసక్తి లేదని, ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా జవాబు ఇస్తామంటూ ఇప్పటికే రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌ ప్రకటించారు.. అంతేకాకుండా.. ఎలాంటి చర్యలకైనా తాము రెడీగా ఉన్నట్లు త్రివిధ దళాధిపతులు కూడా ప్రకటించారు.. దీంతో పాక్ కు గట్టిగానే జవాబు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుంగా.. ఇప్పటికే పాక్ పై దౌత్యపరమైన చర్యలను భారత్ ప్రారంభించింది.
అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ను దోషిగా నిలబెట్టిన భారత్… అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత, వీసాల రద్దు, పాక్ దౌతివేత్తల బహిష్కరణ, పాక్ హై కమిషన్లో ఉన్న త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ చర్యలను ప్రారంభించింది.

Read Also: Pakistan: పాకిస్థాన్ మరో దుశ్చర్య.. మిస్సైల్ టెస్ట్ కు సిద్ధం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Hundreds of gunmen trained Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.