📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం..!!

Author Icon By Vanipushpa
Updated: April 24, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. పహాల్గమ్ ప్రాంతంలో పర్యాటకుల పై టెర్రటిస్టులు కాల్పులు జరపడంతో 28 మంది ప్రజలు మృతి చెందారు. అయితే ఈ ఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా బృందం టెర్రటిస్టులు, ఉద్రవాదాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో అత్యవసర సమావేశం ఏర్పాటు అయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని వెంటనే అమలు చేయాలనీ ఆదేశించారు. అయితే ఈ ఐదు కీలక ప్రకటనలు పాకిస్థాన్ ప్రజలను మాత్రమే కాకుండా, పాక్ దేశ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ ఇంకా జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అయితే ఈ చర్యల ప్రతిఫలనం 24 గంటల్లో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌ పై స్పష్టంగా కనిపించింది.

జమ్మూ ఉగ్రదాడి కొత్త ఉద్రిక్తత
నేడు గురువారం ఉదయం పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ (PSX) భారీ పతనంతో ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా, చైనా-తైవాన్ వంటి ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెమ్మదిస్తున్న సమయంలో ఆసియా మార్కెట్‌లో జమ్మూ ఉగ్రదాడి కొత్త ఉద్రిక్తతను సృష్టించింది. పాకిస్థాన్ స్టాక్ ఇండెక్స్ KSE-100 గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తొలి ఐదు నిమిషాల్లో 2.12% అంటే 2,485.85 పాయింట్లు పతనమై 114,740.29 పాయింట్లకు చేరుకుంది. ఇక మధ్యాహ్నం సమయంలో ఈ పతనం సగానికి 1,535 పాయింట్లకి తగ్గి 115,591 పాయింట్ల వద్ద కొనసాగిస్తోంది.
స్టాక్ మార్కెట్ భారీ పతనం
పాకిస్థాన్ జిడిపి వృద్ధి అంచనా: నిన్న బుధవారం కూడా పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ముగిసిన నేపథ్యంలో, గురువారం అదే పతనాన్ని కొనసాగిస్తూ ప్రారంభమైంది. అయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాకిస్థాన్ జిడిపి వృద్ధి అంచనాను 2.6%కి తగ్గించినట్లు ప్రకటించడంతో బుధవారం ఈ పతనం సంభవించింది. దీనికి తోడు పాకిస్థాన్ రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 0.00355 రూపాయలు పడిపోయింది. రాజకీయ అస్థిరత, కాశ్మీర్‌లో భద్రతా ఆందోళనల గురించి ఫిచ్ రేటింగ్స్ (Fitch Ratings) హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీశాయి. గత మూడు సంవత్సరాలుగా IMF నుండి రుణాల కోసం పోరాడుతున్న పాకిస్థాన్‌కు ఇది భారీ నష్టం.

భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం: ఇవాళ గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడిదుడుకులతో ప్రారంభమైంది. అయితే ఇన్వెస్టర్లు ఈ పరిస్థితులని పరిశీలిస్తు జాగ్రత్త వహిస్తున్నారు. ఉదయం 11:37 గంటల సమయంలో BSE సెన్సెక్స్ 233 పాయింట్లు అంటే 0.29% పతనమై 79,884 పాయింట్ల వద్ద ఉండగా, నిఫ్టీ50 ఇండెక్స్ 69 పాయింట్లు లేదా 0.28% తగ్గి 24,259 పాయింట్లకు చేరుకుంది. మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో, సెన్సెక్స్ 312.50 పాయింట్లు పతనమై 79,790.47 పాయింట్లకు, నిఫ్టీ 86.60 పాయింట్లు తగ్గి 24,241.60 పాయింట్లకు చేరుకుంది.
ఇన్వెస్టర్లను జాగ్రత్త: భారత స్టాక్ మార్కెట్లలో ఈ స్వల్ప పతనం పాకిస్థాన్‌తో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఇన్వెస్టర్లను జాగ్రత్తగా పరిగనిస్తూ పెట్టుబడులు చేయవలసిన పరిస్థితిని సూచిస్తుంది.భారతదేశం కఠినమైన చర్యలు, క్షీణిస్తున్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి పాక్ దేశ స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చే ప్రమాదం ఉంది.

Read Also: Russia : ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Huge fall in Pakistan's Latest News in Telugu Paper Telugu News stock market Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.