📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Flight: విమాన టికెట్ కోసం పిల్లల వయస్సు ఎంత ఉండాలి..?

Author Icon By Vanipushpa
Updated: April 16, 2025 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫ్లయిట్లో జర్నీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ఈ రోజుల్లో అయితే చాలా మంది హాలిడేస్ సమయంలో ఫారెన్ టిప్స్ ప్లాన్ చేసుకొని మరీ ఫ్లయిట్లో జర్నీ చేస్తుంటారు. విహార యాత్రలు, ఫ్రెండ్స్ & ఫ్యామిలీ టూర్స్ ఇలా ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే ఫ్లయిట్లో అలసిపోకుండా హాయిగా ప్రయాణించొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎయిర్ లైన్స్ సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్స్ కూడా అందిస్తుంటాయి. విమాన ప్రయాణీకులకి సంబంధించి చాల విమానయాన సంస్థలు మార్గదర్శకాలను జారీ చేస్తాయి. ముఖ్యంగా పిల్లలతో విమానంలో ప్రయాణించడానికి కూడా కొన్ని రూల్స్ కూడా రూపొందించాయి. అయితే పిల్లలు విమానంలో ప్రయాణించడానికి ఎంత వయసు ఉండాలి.. పిల్లలకి ఎన్ని సంవత్సరాల తర్వాత ఫ్లయిట్ టిక్కెట్లు కొనడం అవసరం.. అసలు పిల్లలకు విమానంలో ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో మీకు తెలుసా?
2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలకు

మీ పిల్లలకి 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే, మీరు విమానంలో సీటు కోసం ప్రత్యేకంగా టికెట్ తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే మీరు 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలని ఫ్రీగా మీ వెంట తీసుకొని ప్రయాణించవచ్చు. ఒకవేళ మీ పిల్లల వయస్సు 2 నుండి 12 సంవత్సరాల మధ్య ఉంటే విమానంలో వారికీ సీటు తప్పనిసరి. విమానయాన సంస్థలు 12 ఏళ్లు పైబడిన పిల్లలను అడల్ట్ ప్రయాణికులుగా పరిగణిస్తాయి. ఈ కారణంగా 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకి ఫుల్ టికెట్ కొనడం తప్పనిసరి.

పిల్లల టిక్కెట్లకు కూడా ఒక రూల్
కొన్ని విమానయాన సంస్థల్లో ప్రయాణించడానికి చిన్న పిల్లలకు కిడ్స్ టిక్కెట్లు కొనడం అవసరం. పిల్లల టిక్కెట్లు పెద్దల టిక్కెట్ల కంటే తక్కువ ఖర్చుతో ఉంటాయి. అంతేకాకుండా పిల్లల కోసం విమానయాన సంస్థలు ప్రత్యేక రకమైన సీట్లను అందిస్తాయి. 5 సంవత్సరాల వయస్సు తర్వాత ఒంటరిగా ప్రయాణించవచ్చు: విమానంలో ఒంటరిగా ప్రయాణించడం గురించి మాట్లాడుకుంటే, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఒంటరిగా ప్రయాణించవచ్చు. విమానంలో పిల్లల ప్రయాణానికి సంబంధించి ప్రతి విమానయాన సంస్థకు వేర్వేరు రూల్స్ ఉన్నాయి.

వికలాంగ పిల్లలకు ప్రత్యేక రూల్స్
వికలాంగులైన పిల్లలకు విమానంలో ఆసౌకర్యం కలగకుండా ఉండటానికి ప్రత్యేక రూల్స్ రూపొందించాయి. శారీరక వైకల్యం ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తారు. అలాగే విమాన ప్రయాణంలో వికలాంగులైన పిల్లలకు స్ట్రెచర్, వీల్‌చైర్ అండ్ వైద్య సహాయం వంటి సౌకర్యాలను ఎయిర్‌లైన్ అందిస్తుంది. 2 సంవత్సరాల వికలాంగులైన పిల్లలకు ఫ్రీ సీట్లు లభిస్తాయి. దీనికి విమాన సంస్థలు ఎటువంటి చార్జెస్ వసూలు చేయదు. మీ పిల్లలకు 2 సంవత్సరాలు నిండకపోతే వారికీ ఒక ఊయల లేదా పిల్లల సీటు ఇస్తారు. 2 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సుగల వికలాంగుల పిల్లల టికెట్ ధర 25% నుండి 50% వరకు తక్కువ ఉంటుంది.
2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు విమానంలో వాటర్ బాటిల్స్, డైపర్లు, నాప్‌కిన్లు ఇంకా ఫుడ్ ప్యాకెట్లు లభిస్తాయి. 2 సంవత్సరాల కంటే పెద్ద పిల్లలకు క్రాఫ్ట్ బుక్స్, పజిల్ గేమ్స్ మొదలైనవి ఇస్తారు.

Read Also: ATM Train: ట్రైన్ జర్నీలోనూ ఏటీఎం మీ వెంటే..!

#telugu News a child be to get a plane ticket? Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu How old should Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.