📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindhoor: సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?

Author Icon By Vanipushpa
Updated: May 9, 2025 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాకిస్తాన్ (India Pakistan) మధ్యలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో, భారత వైపున్న సరిహద్దు (Boders)లోని ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి బయటికి వెళ్లిపోతున్నారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దగ్గర జరుగుతున్న భారీ కాల్పుల నుంచి బయటపడేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పహల్గాం (Pahalgam)లో పర్యటకులపై దాడి అనంతరం, సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను చేపడుతోందని భారత్ చెబుతోంది.
మే 7న బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్‌పై వైమానిక దాడులు జరిపినప్పటి నుంచి ఎల్ఓసీ (LOC) గుండా జరుగుతోన్న కాల్పుల్లో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా, 59 మంది గాయపడ్డట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

OperationSindoor: సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?

మృతుల్లో మహిళలు, పిల్లలు
మృతుల్లో మహిళలు, పిల్లలు, భారత ఆర్మీ జవాను లాన్స్ నాయక్ దినేష్ కుమార్ ఉన్నారు. పంజాబ్‌లోని చాలా జిల్లాల్లో క్షిపణులు, డ్రోన్ల శకలాలను గుర్తించిన తర్వాత అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మే 7, 8 తేదీల్లో రాత్రిపూట పాకిస్తాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను, క్షిపణి దాడులను భగ్నం చేసినట్లు భారత్ చెప్పింది. ఆ తర్వాత గురువారం (మే 8న) లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసినట్లు భారత్ తెలిపింది. కానీ, ఇప్పటి వరకు ఈ విషయాన్ని పాకిస్తాన్ ధ్రువీకరించలేదు.
బుధవారం రాత్రి డ్రోన్, క్షిపణి దాడులు
ఎల్‌ఓసీ సమీపంలో జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంఛ్, రజౌరిలలో భారీ ఫిరంగులను వాడుతున్నట్లు గురువారం విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. పూంఛ్‌లోని గురుద్వారాను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి జరిపిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ఆ దాడిలో సిక్కు వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్లు తెలిపారు. బుధ, గురువారాల్లో ఉత్తర, పశ్చిమ భారత్‌లో ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడికి యత్నించిందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అవంతీపొరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్‌లాయ్, భుజ్‌లలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను జరిపినట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా దాడులకు అడ్డుకట్ట
”ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ దాడులను అడ్డుకున్నాం. పలు ప్రాంతాల్లో ఈ దాడుల శకలాలను గుర్తించాం. పాకిస్తాన్ దాడులు జరిపినట్లు ఇవి ధ్రువీకరిస్తున్నాయి” అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాత్రి 25 భారత డ్రోన్లను కూల్చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్ల వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పింది.
ఎల్ఓసీ వద్ద పరిస్థితి ఎలా ఉంది?
” భారీ పేలుళ్లను నేను విన్నాను. ఏడాది బిడ్డను తీసుకుని పరిగెత్తుకుని వచ్చాను. నాకు చాలా భయం వేసింది” అని స్థానికురాలు సోబియా చెప్పారు. తమ ఇంటి ఎదుట షెల్ పడటంతో, ఇంటి నుంచి తాను, తన కుటుంబం బయటికి వచ్చినట్లు స్థానికులైన సఫ్రీన్ అఖ్తర్ చెప్పారు. ”ఆ సమయంలో కారు కనిపించలేదు. సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు కిలోమీటర్ల కొద్ది నడవాల్సి వచ్చింది. దారంతా కాల్పుల శబ్దం వినిపిస్తూనే ఉంది” అని అన్నారు.

గత 48 గంటలుగా పూంఛ్‌లో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతుండటంతో, సురాన్‌కోట్‌లోని తమ బంధువులను, స్నేహితులను ఆశ్రయాన్ని కోరుతున్నట్లు చాలామంది చెప్పారు. ఇది సరిహద్దుకు కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడ కాల్పుల ఘటనలు ఎక్కువగా జరగడం లేదు. ”మా ఇంట్లో 25 మంది వరకు ఉంటున్నారు. కొంతమంది నడుస్తూ ఇక్కడకు వచ్చారు. కొందరు తమ ఇళ్లకు తాళాలను కూడా వేసుకోలేకపోయారు” అని సురాన్‌కోట్‌కు చెందిన మొహమ్మద్ ఆలమ్ మాలిక్ చెప్పారు. ”అంతకుముందు అంత విస్తృతంగా ప్రజల తరలింపు లేదు. 2016లో సరిహద్దు సమీపంలో నివసించే 27 వేల మందికి పైగా బయటికి వెళ్లిపోయారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు సరిహద్దులో నివసించే వారికి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి”
పంజాబ్ గ్రామాల్లో రాకెట్ లాంటి వస్తువులు
పంజాబ్‌లోని పలు గ్రామాల్లో గురువారం రాకెట్ లాంటి వస్తువుల శకలాలను గుర్తించినట్లు బీబీసీ పంజాబీ తెలిపింది. కొన్ని శిథిలాలను గుర్తించానని, తన పొలం తగలబడిపోయిందని గుర్దాస్‌పూర్‌లోని పంధేర్ గ్రామానికి చెందిన రచ్‌పాల్ సింగ్ తెలిపారు. బుధవారం రాత్రి అమృత్‌సర్, భటిండా, గుర్దాస్‌పూర్‌లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనుమానిత వస్తువులను గుర్తించారు. పాకిస్తాన్ నుంచి కాల్పులు జరుగుతున్నాయని తాము భావిస్తున్నట్లు గ్రామస్థులు చెప్పారు. ”రాత్రి పూట భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉదయం పూట పొలంలో క్షిపణి శకలాలను గుర్తించాం. వీటి గురించి పోలీసులకు చెప్పాం” అని అమృత్‌సర్‌లోని జేతువాల్ గ్రామవాసి దిల్దార్ సింగ్ తెలిపారు. పొలాల్లో 6 నుంచి 7 అడుగుల రాకెట్ లాంటి వస్తువును చూసినట్లు మరో స్థానికుడు లవ్‌ప్రీత్ సింగ్ చెప్పారు. మోగా జిల్లాలోని ఓ గ్రామంలో ఒక పశువుల షెడ్డుపై ఇనుప వస్తువు పడిందని బీబీసీ ప్రతినిధి సురీందర్ మన్ చెప్పారు. తల్వాండిలోని భాంగేరియా గ్రామంలో ఇలాంటి ఒక ఇనుప వస్తువును గుర్తించారు. పరిపాలనా యంత్రాంగం వీటిపై విచారణ ప్రారంభించింది. ఈ వస్తువులపై స్థానిక అధికారులు మరింత సమాచారం ఇవ్వలేదు.

Read Also: Pakistan: పాకిస్థాన్‌-భారత్‌ దాడులపై RSS చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu How is the situation of Indians Indians at the borders? Latest News in Telugu Operation Sindhoor Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.