📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Bharatha Pakistan: కాల్పుల విరమణ కోసం అమెరికా ఎలా పని చేసింది?

Author Icon By Vanipushpa
Updated: May 12, 2025 • 2:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనేక నాటకీయ పరిణామాల తర్వాత భారత్, పాకిస్తాన్‌ (India, Pakistan) ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు చెప్పేందుకు సోషల్ మీడియాను ఎంచుకున్నారు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ (Donald Trump). రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణను తగ్గించడంలో అమెరికా (America) మధ్యవర్తులతో పాటు, తెరచాటున జరిగిన అనేక దౌత్య ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు. ఇంత జరిగినా, సీజ్ ఫైర్ మొదలైన కొద్దిసేపటికే, దాని ఉల్లంఘన జరుగుతోందంటూ ఇరు దేశాలు ఆరోపణలు చేసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఎంత బలహీనంగా ఉందో ఇది చెప్పకనే చెప్పినట్లయింది. పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతోందని భారత్ (Bharath) ఆరోపిస్తుంటే, తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, తమ బలగాలు బాధ్యత, సంయమనం ప్రదర్శిస్తున్నాయని పాకిస్తాన్ అంటోంది. ట్రంప్ (Trump) కాల్పుల విరమణ ప్రకటనకు ముందు, భారత్ పాకిస్తాన్ (India, Pakistan) మధ్య ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చని చాలామంది భయపడే దిశగా సాగుతూ వెళ్లింది.

Bharatha Pakistan: కాల్పుల విరమణ కోసం అమెరికా ఎలా పని చేసింది?

కశ్మీర్ మీద వైమానిక దాడులు
పహల్గాంలో తీవ్రవాద దాడిలో 26 మంది పర్యటకులు మరణించిన తర్వాత, భారత్ పాకిస్తాన్, పాక్ పాలిత కశ్మీర్ మీద వైమానిక దాడులు చేసింది. ఇది రోజుల తరబడి గగనతల ఘర్షణలు, ఫిరంగి దాడులకు దారి తీసింది. శనివారం ఉదయం తమ వైమానిక స్థావరాలపై దాడులు జరిపారంటూ రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ వాదనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రెండు దేశాలు తాము ప్రత్యర్థి దాడులను భగ్నం చేశామని చెప్పడంతోపాటు, శత్రువుకు భారీ నష్టం కలిగించామని ప్రకటించుకున్నాయి.
మూడు డజన్ల దేశాల మధ్యవర్తిత్వం..?
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మే 9న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఫోన్ చేశారు. “అదే కీలకమైన అంశం అయి ఉండవచ్చు” అని వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీనియర్ ఫెలో తన్వీ మదన్ అన్నారు. “ఇంకా అనేకమంది అంతర్జాతీయ వ్యక్తులు, దేశాల పాత్ర గురించి మనకు తెలియదు. అయితే ఒకటి సుస్పష్టం. మూడు రోజుల నుండి కనీసం మూడు దేశాలు ఈ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాతో పాటు బ్రిటన్, సౌదీ అరేబియా కూడా వాటిలో ఉండి ఉండవచ్చు” అని తన్వీ మదన్ అన్నారు. పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ “మూడు డజన్ల దేశాలు” దౌత్య ప్రక్రియలో పాల్గొన్నాయని చెప్పారు.
అమెరికా మధ్యవర్తిత్వం ఇదే తొలిసారి కాదు
భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల్ని తగ్గంచడంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించడం ఇదే తొలిసారి కాదు. 2019లో పాకిస్తాన్ అణ్వాయుధాలను సిద్ధం చేస్తోందని కంగారు పడుతున్న ఓ వ్యక్తితో తాను మాట్లాడానని అమెరికా మాజీ విదేశాంగమంత్రి మైక్ పాంపియో గుర్తు చేసుకున్నారు. తన హోదాకు సమానమైన ఆ వ్యక్తి పేరు చెప్పడానికి పాంపియో ఇష్టపడలేదు.
అమెరికా సమయానుకూలంగా స్పందించిందా?
అణు ప్రమాదం గురించి, ఉద్రిక్తతలను తగ్గించి, పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడంలో అమెరికా పాత్ర గురించి పాంపియో కాస్త అతిశయోక్తిగా చెప్పారని పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా తన పుస్తకంలో రాశారు. అయితే ఈసారి సంక్షోభాన్ని తగ్గించడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందనే దాని మీద సందేహాలు ఉన్నాయని దౌత్య వేత్తలు చెబుతున్నారు. “అమెరికా కీలక పాత్ర పోషిస్తుంది. గతంలోనూ తాము అణు యుద్ధాన్ని ఆపామని పాంపియో చెప్పారు.
‘‘అది మా పని కాదు’’ :జేడీ వాన్స్
ఉద్రిక్తతలు చెలరేగగానే, భారత్- పాకిస్తాన్ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది లేదని ‘‘అది మా పని కాదు’’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. “మేము ఆ దేశాలను నియంత్రించలేము” అని ఆయన అన్నారు. ”భారత్‌కు పాకిస్తాన్‌తో విభేదాలు ఉన్నాయి. ఆయుధాలు వదిలేయాలని అమెరికా ఇండియాకు చెప్పలేదు. అలాగే పాకిస్తాన్‌కూ చెప్పలేదు. దౌత్య మార్గాల ద్వారా మా ప్రయత్నాలు కొనసాగిస్తాం” అని జేడీ వాన్స్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదిలా ఉండగానే, అధ్యక్షుడు ట్రంప్ గతవారం మొదట్లో “నాకు రెండు దేశాల నాయకులు బాగా తెలుసు.
మూడు కీలక అంశాలు
“గత సందర్భాలతో పోలిస్తే ఇదొక్కటే తేడాగా కనిపిస్తోంది” అని లాహోర్‌లో ఉంటున్న రక్షణ రంగ నిపుణుడు ఇజాజ్ హైదర్ చెప్పారు. “అమెరికా పాత్ర గతంలో అనుసరించిన విధానానికి కొనసాగింపుగా ఉంది. అయితే ఈసారి కీలక మార్పు ఏంటంటే, మొదట్లో వాళ్లు దీనికి దూరంగా ఉన్నారు. వెంటనే ఇందులో జోక్యం చేసుకునే బదులు, ఈ సంక్షోభం ముదిరిపోయే వరకు చూశారు. పరిస్థితులు చేయిదాటిపోతున్న సమయంలో రంగంలోకి దిగారు” అని హైదర్ చెప్పారు. ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత పాకిస్తాన్ రెండు రకాల సంకేతాలు పంపించిందని పాకిస్తాన్‌లో నిపుణులు చెబుతున్నారు.
పాకిస్తాన్ ‌అణ్వాయుధాల నియంత్రణ
పాకిస్తాన్ ‌అణ్వాయుధాల నియంత్రణ, వాటి ప్రయోగానికి సంబంధించిన నిర్ణయాలను నేషనల్ కమాండ్ అథారిటీ తీసుకుంటుంది. ఈ సమయంలోనే అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో రంగంలోకి దిగారు. “అమెరికా పాత్ర చాలా ముఖ్యమైనది. రుబియో ప్రయత్నించకపోయి ఉంటే ఈ ఫలితం సాధ్యమయ్యేది కాదు” అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో సీనియర్ ఫెలో అష్లే జే టెల్లిస్ చెప్పారు. ఇందులో వాషింగ్టన్‌కు దిల్లీతో ఉన్న బలమైన బంధం కూడా ఉపయోగపడింది.
సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం
2019లో పుల్వామా- బాలాకోట్ తర్వాత, ఈసారి శాంతి సాధనలో మూడు కీలకమైన అంశాలు ఉన్నాయని భారతీయ దౌత్యవేత్తలు భావిస్తున్నారు. సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం, సౌదీ విదేశాంగ సహాయమంత్రి రెండు దేశాల రాజధానుల్లో పర్యటించారు. భారత్ పాకిస్తాన్ జాతీయ భద్రత సలహాదారుల మధ్య డైరెక్ట్ చానల్. అంతర్జాతీయ ప్రాధాన్యతలు పెను మార్పులు జరుగుతున్నవేళ, మొదట విముఖంగా ఉన్నప్పటికీ, అమెరికా ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిగా అడుగు పెట్టింది.
Read Also: TRUMP: ‘కశ్మీర్‌ సమస్య పరిష్కరిస్తా’- ట్రంప్ కొత్త ప్రకటన

#telugu News Ap News in Telugu Breaking News in Telugu for a ceasefire? Google News in Telugu How did America work Latest News in Telugu Operation Sindhoor Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.