కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ (World Boxing) కప్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ల ప్రతిభ జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతాపం చూపుతోంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లలో భారత బాక్సర్లు హితేశ్ గులియా (Hitesh Gulia),సాక్షి విశేషంగా రాణించి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. వారి అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రెండు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల 70 కిలోల క్వార్టర్స్ బౌట్‌లో హితేశ్ 5-0 తేడాతో అల్మాజ్ ఒర్జోబెకెవ్(కజకిస్థాన్)పై అద్భుత విజయం సాధించాడు.
మొదట ఒత్తిడిగా అనిపించినా, హితేశ్
ప్రారంభం నుంచే హితేశ్ తన దూకుడు, ఫుట్‌వర్క్, పంచ్ సమర్థతతో ప్రత్యర్థిపై ఒత్తిడిని కొనసాగించాడు. ప్రత్యర్థి దేశం నుంచే ఈ టోర్నమెంట్ జరుగుతుండడం, ప్రేక్షకుల మద్దతు పూర్తిగా అల్మాజ్‌కు ఉండడంతో మొదట ఒత్తిడిగా అనిపించినా, హితేశ్ తన అనుభవంతో అదరగొట్టాడు. ముఖ్యంగా రెండో రౌండ్ (Second Round) నుంచి హితేశ్ గట్టి దెబ్బలతో ప్రత్యర్థిని వెనక్కి తిప్పేశాడు. చివరి రౌండ్‌లో క్లాస్ చూపిస్తూ 5-0తో అఖండ విజయం అందుకున్నాడు.
ఆధిక్యంతో పాయింట్లు
మరోవైపు మహిళల 54కిలోల క్వార్టర్స్‌లో సాక్షి (Sakshi) బ్రెజిల్ బాక్సర్ తతియాన రెజినా డీ జీససస్ చాగస్‌పై అలవోక విజయం సాధించింది.దూకుడైన ఆరంభంతో ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచింది. ప్రతి రౌండ్‌లో స్పష్టమైన ఆధిక్యంతో పాయింట్లు సాధించిన ఆమె, గేమ్‌ను పూర్తి నియంత్రణలో ఉంచింది. ఆమె గెలుపుతో భారత్‌కు మరో కాంస్య పతకం ఖాయమైంది.టోర్నీ లో ఇప్పటికే మీనాక్షి (48కి), పూజారాణి (80కి), సంజు (60కి), అనామిక(51కి) పతకాలు ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ విజయాలతో భారత్ ఖాతాలో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు చేరాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: IND vs ENG: ఫోకస్ వల్లే రికార్డు ఇన్నింగ్స్ సాధ్యమైంది: గిల్