Latest Telugu News: Demond రష్యాలో కీలక రంగాల్లో భారతీయ కార్మికులకు భారీ డిమాండ్

Read Time:  1 min
రష్యాలో కీలక రంగాల్లో భారతీయ కార్మికులకు భారీ డిమాండ్
రష్యాలో కీలక రంగాల్లో భారతీయ కార్మికులకు భారీ డిమాండ్
FONT SIZE
GET APP

రష్యా(Russia)లో భారతీయ(India) నిపుణులకు, కార్మికులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ రంగాలతో పాటు ఇప్పుడు మెషినరీ, ఎలక్ట్రానిక్స్ వంటి కీలకమైన విభాగాల్లోనూ రష్యన్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడానికి అధిక ఆసక్తి చూపుతున్నాయి. ఈ విషయాన్ని రష్యాలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న వినయ్ కుమార్(Vinay Kumar) స్వయంగా వెల్లడించారు. ఆయన ఇటీవల రష్యా ప్రభుత్వ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ కీలక విషయాలను పంచుకున్నారు. రష్యాలో మానవ వనరుల అవసరం ఉందని, అదే సమయంలో భారత్‌లో నైపుణ్యం కలిగిన మానవశక్తి అందుబాటులో ఉందని వినయ్ కుమార్ తెలిపారు.

కోటా పరిమితులకు లోబడి..

“ప్రస్తుతం రష్యా చట్టాలు, నిబంధనలు, కోటా పరిమితులకు లోబడి అక్కడి కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా నిర్మాణ, టెక్స్‌టైల్ రంగాల్లోనే మనవాళ్లు పనిచేస్తున్నారు. అయితే, ఇప్పుడు మెషినరీ, ఎలక్ట్రానిక్స్ వంటి సాంకేతిక విభాగాల్లోనూ వారి అవసరం పెరుగుతోంది” అని ఆయన వివరించారు.

Demond రష్యాలో కీలక రంగాల్లో భారతీయ కార్మికులకు భారీ డిమాండ్
Demond రష్యాలో కీలక రంగాల్లో భారతీయ కార్మికులకు భారీ డిమాండ్

భారతీయులు అధిక సంఖ్యలో రష్యాకు వస్తుండటంతో రాయబార కార్యాలయంపై పనిభారం కూడా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం వచ్చి వెళ్లే వారికి పాస్‌పోర్ట్‌ల పునరుద్ధరణ, పిల్లల జనన ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌లు పోగొట్టుకున్నప్పుడు అందించే సేవలు వంటి కాన్సులర్ సేవలు ఎక్కువగా అవసరమవుతున్నాయని తెలిపారు.

అమెరికా, కెనడా, యూకే

అమెరికా, కెనడా, యూకే వంటి పాశ్చాత్య దేశాలు వలసల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న తరుణంలో, రష్యా భారతీయులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-రష్యా మధ్య ఎప్పటినుంచో బలమైన స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాలో భారతీయులకు ఉపాధి అవకాశాలు పెరగడం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రష్యా పాత పేరు ఏమిటి?
ఆధునిక రష్యాగా మారిన భూభాగం పేరు చాలాసార్లు మారిపోయింది, కానీ చారిత్రాత్మకంగా ఇందులో రష్యా, గ్రాండ్ డచీ ఆఫ్ మాస్కో, జార్డమ్ ఆఫ్ రష్యా మరియు సోవియట్ యూనియన్ ఏర్పడటానికి ముందు రష్యన్ సామ్రాజ్యం ఉన్నాయి. ఈ పేరు భూభాగాలు మరియు సంస్థానాల సముదాయం నుండి ఉద్భవించింది, ఇవి చివరికి వివిధ రాజవంశాలు మరియు సామ్రాజ్యాల క్రింద ఐక్యమయ్యాయి.
రష్యాలో ఏ మతాలు ఉన్నాయి?
రష్యాలో ఆధిపత్య మతం ఆర్థడాక్స్ క్రైస్తవ మతం, జనాభాలో గణనీయమైన భాగం ఆర్థడాక్స్ క్రైస్తవులుగా గుర్తించబడుతోంది. ఇతర ప్రధాన మతాలలో ఇస్లాం ఉన్నాయి, ఇది రెండవ అతిపెద్ద మతం, మరియు బౌద్ధులు, యూదులు మరియు వివిధ ప్రొటెస్టంట్ మరియు కాథలిక్ సమూహాల చిన్న సమాజాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/amit-shah-support-for-the-constitution-amendment-bill/national/535674/

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.