విదేశీ విద్యార్థుల చేర్పు అధికారాన్ని రద్దు చేస్తామని హెచ్చరిక
అంతర్జాతీయ విద్యార్థులపై చట్టవిరుద్ధమైన, హింసాత్మక కార్యకలాపాల రికార్డులు ఏప్రిల్ 30, 2025 లోపు అందించకపోతే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులను చేర్చుకునే అధికారాన్ని కోల్పోతుంది అని యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) బుధవారం ప్రకటించింది.
USD 2.7 మిలియన్ల గ్రాంట్లను రద్దు
హార్వర్డ్‌కు ఇప్పటివరకు USD 2.7 మిలియన్లకు పైగా అందిన రెండు ఫెడరల్ గ్రాంట్లు కూడా DHS రద్దు చేసింది. USD 800,303 – టార్గెటెడ్ వయోలెన్స్ ప్రివెన్షన్ గ్రాంట్, USD 1,934,902 – బ్లూ క్యాంపెయిన్ ప్రోగ్రాం గ్రాంట్, “యూదు వ్యతిరేకత – జాతీయ భద్రతకు ముప్పు”. DHS కార్యదర్శి క్రిస్టి నోయెమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “హార్వర్డ్ నాయకత్వం వెన్నెముకలేని చర్యలతో యూదు వ్యతిరేకతకు మద్దతిచ్చింది, ఇది జాతీయ భద్రతకు ప్రమాదం.” “అమెరికా వ్యతిరేక భావజాలం, హమాస్ అనుకూల ఉద్యమాలు హార్వర్డ్ తరగతి గదులను విషపూరితం చేస్తున్నాయి.”
ఏప్రిల్ 30, 2025 – కీలక గడువు
SEVP (Student & Exchange Visitor Program) సర్టిఫికేషన్ కొనసాగాలంటే, హార్వర్డ్ విదేశీ విద్యార్థుల చట్టవిరుద్ధ కార్యకలాపాల రికార్డులు అందించాల్సి ఉంటుంది. లేదంటే, విదేశీ విద్యార్థుల చేర్పు అధికారం పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉంది. హార్వర్డ్ ఇప్పటికే USD 2.2 బిలియన్ల ఫెడరల్ ఫండింగ్‌ను కోల్పోయింది,
ఇప్పుడు మరోసారి ధనిక విద్యా సంస్థ అయినా ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని కోల్పోతోంది.
హార్వర్డ్‌లో అంతర్జాతీయ విద్యార్థుల పరిస్థితి
6,793 మంది అంతర్జాతీయ విద్యార్థులు ప్రస్తుతం హార్వర్డ్‌లో చదువుతున్నారు
ఇది మొత్తం విద్యార్థులలో 27.2% ఈ చర్యలు 2024-25 విద్యా సంవత్సరానికి తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటివరకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ చర్యలపై ప్రత్యక్షంగా స్పందించలేదు.
అయితే విద్యా, మానవ హక్కుల సంస్థలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హార్వర్డ్‌పై ఈ దాడి అమెరికాలో ఉన్నత విద్యా స్వేచ్ఛపై దెబ్బగా అభిప్రాయపడుతున్నారు పలువురు.
Read Also: Tana: తానాతో కుమ్మక్కైన 200 మంది తెలుగు ఉద్యోగుల అవుట్