📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Harbhajan Singh: ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌ ని కూడా ఆడనివ్వాలి: హర్భజన్

Author Icon By Anusha
Updated: June 17, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం టీమిండియా సిద్దమైంది. వేదికగా లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానం ఎంచుకోబడింది. ఈ నెల 20వ తేదీ నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇదే మ్యాచ్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2027 సీజన్‌కి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన సన్నాహకాలను టీమిండియా పూర్తి చేసుకుంది. సీక్రెట్‌గా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడింది. అయితే సాధారణంగా ఇంగ్లండ్ కండీషన్స్ పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. ఇటీవల జరిగిన సిరీస్‌లు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాయి. అయితే భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌లకు స్పిన్‌కు అనుకూలంగా ఉండే వికెట్లు తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇంగ్లండ్ పేస్ విభాగం బలహీనంగా ఉండటంతో ఆ జట్టు స్పిన్ పిచ్‌లకు మొగ్గు చూపవచ్చనే ప్రచారం జరుగుతోంది.

స్పెషలిస్ట్ స్పిన్నర్

ఈ క్రమంలోనే భారత్‌తో సిరీస్‌కు స్పిన్, పేస్‌కు అనుకూలంగా ఉండే వికెట్లను సిద్దం చేయవచ్చని తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలోనే టీమిండియా రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒక్కడిపైనే ఆధారపడకూడదని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. రవీంద్ర జడేజాతో పాటు ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను కూడా ఆడించాలని సూచిస్తున్నారు. జడేజా ఒక్కడినే నమ్ముకుంటే కుదరదని, స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌ (Kuldeep Yadav) ను కూడా తుది జట్టులో ఆడించాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఎలాంటి కండిషన్స్‌లోనైనా రాణించే సత్తా ఈ ఇద్దరి స్పిన్నర్లకు ఉందని చెప్పాడు.

Harbhajan Singh

పిచ్ కండిషన్స్

జడేజా రూపంలో స్పిన్ ఆప్షన్ ఉన్నప్పటికీ టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలి. పిచ్ కండిషన్స్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయో లేవో కూడా చూసుకోవాలి. అయితే కుల్దీప్-జడేజా ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలరు. వారికి ఆ సామర్థ్యం ఉంది.’అని హర్భజన్ సింగ్ (Harbhajan Singh) చెప్పుకొచ్చాడు.భారత్ నలుగురు పేసర్లు, ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇటీవల లార్డ్స్ వేదికగా జరిగిన సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్లో స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్వింగ్ బౌలింగ్‌కు ఇంగ్లండ్ కండిషన్స్ అనుకూలంగా ఉంటాయి. వాతావరణం చల్లగా ఉండి, పిచ్‌పై గ్రాస్ ఉంటే పేసర్లకు తిరుగుండదు. అయితే నాలుగు, ఐదో రోజు వరకు మ్యాచ్‌ సాగితే మాత్రం స్పిన్నర్లు కీలకమవుతారు.

Read Also: James Anderson: విరాట్ కోహ్లీకి సచిన్ కంటే బౌలింగ్ చేయడం కష్టం: అండర్సన్

#HarbhajanSingh #KuldeepYadav #RavindraJadeja #TeamIndia Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.