📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Hamas Leader: హమాస్​ అగ్రనేత సిన్వర్ హతం..ఇజ్రాయెల్​ ప్రధాని ధ్రువీకరణ

Author Icon By Vanipushpa
Updated: May 29, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌(Hamas) అగ్రనేత మహ్మద్‌ సిన్వర్‌(Hamas Leader Sinwar) హతమయ్యాడు. ఈ మేరకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ధ్రువీకరించారు. ఇటీవల ఇజ్రాయెల్‌(Israel) జరిపిన దాడుల్లో సిన్వర్‌ మృతిచెందినట్లు పార్లమెంట్​ వద్ద మాట్లాడుతూ వెల్లడించారు. తాజా పరిణామాలపై మాట్లాడిన నెతన్యాహు ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతి చెందిన హమాస్‌ నేతల జాబితాను ప్రకటించారు. 2023 అక్టోబర్​ 7న ఇజ్రాయెల్​పై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారి సిన్వర్.

Hamas Leader: హమాస్​ అగ్రనేత సిన్వర్ హతం..ఇజ్రాయెల్​ ప్రధాని ధ్రువీకరణ

యుద్ధ విమానాలతో బాంబుల వర్షం
మహ్మద్‌ సిన్వర్‌ లక్ష్యంగానే ఇజ్రాయెల్‌ సైనిక దళాలు బుధవారం దాడులు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఖాన్‌ యూనిస్‌లోని యూరోపియన్‌ ఆసుపత్రి భూగర్భ మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు జరిపాయి. యుద్ధ విమానాలతో డజన్ల కొద్దీ బాంబులను వదిలాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోగా మరో 70 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లోనే మహ్మద్‌ సిన్వర్‌ కూడా మృతి చెందినట్లు సమాచారం.
కాగా, హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ సోదరుడే ఈ మహ్మద్‌ సిన్వర్‌. హమాస్‌ మిలటరీ వింగ్‌ సారథి డెయిఫ్‌ మృతి తర్వాత ఆ బాధ్యతలను మహ్మద్‌ సిన్వర్‌ తీసుకున్నాడు. అనంతరం తన సోదరుడు యాహ్యా మరణానంతరం హమాస్‌ టాప్‌ కమాండర్‌ స్థాయికి చేరుకున్నాడు. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ మెరుపుదాడి సూత్రధారిగా ఉన్న యాహ్యా సిన్వర్‌ గతేడాది మృతిచెందగా తాజాగా జరిగిన దాడిలో ఇతడు కూడా హతమయ్యాడు. అంతకుముందు హమాస్‌ అధినేతగా ఉన్న ఇస్మాయెల్‌ హనియే గతేడాది జులైలో ఇరాన్‌లోని టెహ్రాన్‌ బాంబు పేలుడు ఘటనలో హతమయ్యాడు.
నిద్రలోనే చనిపోయిన 18 మంది చిన్నారులు
అంతకుముందు ఆదివారం గాజాపై ఇజ్రాయెల్ చేసిన వేర్వేరు దాడుల్లో 54 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. మృతుల్లో జబాలియాలో ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న 18 మంది చిన్నారులు సహా 36 మంది ఉన్నట్లు వెల్లడించారు. నిద్రలోనే వీరంతా చనిపోయారని స్థానికులు చెప్పారు. మొత్తం మూడు సార్లు ఈ పాఠశాలపై ఇజ్రాయెల్‌ సైన్యం బాంబుల వర్షం కురిపించిందని వివరించారు. జబాలియాలో చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 16 మంది సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Read Also: Student Visas: వీసాలపై అమెరికా కీలక నిర్ణయం..స్పందించిన చైనా

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Hamas leader Sinwar killed Israeli PM confirms Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.