Latest news: Visa: హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్.. భారతీయులకు ఊరట..

Read Time:  1 min
Visa
Visa
FONT SIZE
GET APP

నిధుల లోపం కారణంగా అమెరికా(America) ప్రభుత్వం(Visa) షట్ డౌన్ అయింది. ఈ క్రమంలో యూఎస్ లేబర్ డిపార్ట్ మెంట్ కూడా మూతపడింది. దీంతో హెచ్-1బి, హెచ్-2ఎ, హెచ్-2బి వీసాల ప్రాసెసింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడ ఇది మొదలైందని అమెరికా లేబర్ డిపార్ట్వమెంట్ అనౌన్స్ చేసింది. ఫారిన్ లేబర్ అప్లికేసన్ గేట్ వే (ప్లాగ్) సిస్టమ్ తిరిగి ప్రారంభమైంది. దీంతో అమెరికాలో ఉన్న కంపెనీలు..విదేశీ వర్కర్లను నియమించుకోవడానికి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ప్రాసెస్ లో ఉన్న అప్లికేషన్ల స్టేటస్ ను తెలుసుకోవడం, కొత్త వాటిపై అప్లై చేసుకోవడం లాంటివి ఇక మీరు చేయవచ్చు అని పేర్కొంది. ఒకరకంగా హెచ్ 1బీతో పాటు ఇతర వీసాలతో ఉద్యోగాలు పొందాలనుకుంటున్న వారికి మంచి పరిణామం.

Read also: ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి కానిస్టేబుల్ ఆత్మహత్య

Visa
Visa: హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్.. భారతీయులకు ఊరట..

అమెరికాలో మొదలైన వీసాల ప్రాసెస్

అమెరికాలో పని చేయాలంటే లేబర్ సర్టిఫికెట్లు కావాలి. దీన్ని ఒఎఫ్ ఎల్సి ఇస్తుంది. హెచ్-1బి, హెచ్-2ఎ, హెచ్-2బి వీసాలతో (Visa) విదేశీ వర్కర్లను నియమించుకోవాలంటే అమెరికాలోని కంపెనీలు ఈ సర్టిఫికెట్ ను పొందాలి. అయితే ఫ్లాగ్ అనే ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒఎఫ్ ఎల్సి సర్టిఫికెట్ ఉంటేనే.. యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వద్ద హెచ్ 1బీ లాంటి వీసా పిటిషన్లు వేసుకోవడానికి వీలు కలుగుతుంది. లేకుంటే వీసా ప్రాసెస్ ముందుకు కదలదు. కాగా, విదేశీ టెక్ నిపుణుల కోసం ఇచ్చేది హెచ్ 1బీ వీసా. ఇక తాత్కాలిక వ్యవసాయ రంగంలో ఉద్యోగాల కోసం హెచ్-2ఎ వీసా ఇస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.